అవకాడో, వాల్నట్స్, బాదం వంటి గింజలు, ఫ్యాటీ చేపల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి చెడు కొవ్వును కరిగిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయని క్లీవ్‌లాండ్ క్లీనిక్ తెలిపింది.
వెజ్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. చెడు కొవ్వు కరుగుతుంది. బీన్స్, శనగలు, ఎడమామే వంటి వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు, ప్రోటీన్ లభిస్తుంది.
ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. ఓట్స్, బీన్స్, బ్రోకలీ, బ్రస్సెల్స్ మొలకల్లో ఫైబర్ లభిస్తుంది.
అవిసె గింజల్లో కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా లభిస్తాయి. అవిసె గింజలు తింటే చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.
క్రమం తప్పకుండా వాకింగ్, రన్నింగ్ వంటి వ్యాయామాలు చేయండి. దీంతో చెడు కొవ్వు కరుగుతుంది. వారానికి 150 నిమిషాల పాటు ఎరోబిక్ వ్యాయామం చేయండి.
ఒత్తిడి వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఒత్తిడి పెరిగితే గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. చెడు ఆహారం తినే అవకాశం ఉంది. దీంతో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కాబట్టి ఒత్తిడి తగ్గేందుకు ధ్యానం చేయండి.
ధూమపానం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మంచి కొవ్వు తగ్గుతుంది. కాబట్టి సిగరెట్‌కు దూరంగా ఉండండి.
మందు తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆల్కాహాల్ తాగడం వల్ల కేలరీల ఇన్‌టేక్ పెరుగుతుంది. దీంతో బరువు పెరుగుతారు. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
ట్రాన్స్‌ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. బేకరీ ఉత్పత్తులు, పిజ్జాలు, బర్గర్లలో ట్రాన్స్‌ఫ్యాట్ ఉంటుంది.