
కూరల రుచిని పెంచడం నుండి సలాడ్ల వరకు టమోటాలను అన్నింటికీ ఉపయోగిస్తారు. చాలామంది కూరగాయల కంటే టయోటాలే ఎక్కువ కొనుగోలు చేస్తుంటాయి.
అయితే వేసవి కాలంలో టమోటాలను ఒకేచోట నిల్వ చేయడం వల్ల అవి ఎక్కువుగా కుళ్ళిపోతాయి. ఇది చాలా మంది ఎదుర్కునే సాధారణ సమస్య. వాటిని సరిగ్గా నిల్వ చేయడం ద్వారా పాడవకుండా నివారించవచ్చు. అందుకోసం టమాటాలను ఎలా నిల్వ చేయాలి తెలుసుకుంటే..
టమాటా పూర్తిగా పండకపోయినా, ఇంకా కొంచెం గట్టిగా ఉంటే, దానిని గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసుకోవచ్చు. పండని టమాటాలను డైరెక్ట్ సన్ లైట్ కు దూరంగా ఉంచాలి. పచ్చి గా ఉన్నవి, పూర్తీగా పండని టమాటాలను ఫ్రిజ్లో నిల్వ చేయకూడదు. దీనివల్ల అవి రుచిని కోల్పోయి, సరిగ్గా పండకుండా ఉంటాయి.
టమోటాలు పూర్తిగా పండి, ఎర్రగా ఉంటే, అవి గట్టిగా ఉంటే.. వాటిని గది ఉష్ణోగ్రత వద్ద కౌంటర్పై నిల్వ చేయాలి. ఈ టమోటాలను 1 నుండి 2 రోజుల వరకు ఉపయోగించవచ్చు. టమోటాలను కాడ భాగం కిందికి ఉండేలా నిల్వ చేయాలి. దీనివల్ల కాడ చుట్టూ ఉన్న తేమ బయటకు పోతుంది , అవి త్వరగా వాడిపోకుండా ఉంటాయి. టమోటాలను ఒకదాని మీద ఒకటి కాకుండా అన్నింటికి పక్కన పక్కన ఉంచి నిల్వ చేయాలి.
టమోటాలు బాగా పండితే పాడైపోతాయని చాలామంది భయపడతారు. వాటిని రిఫ్రిజిరేటర్లోని చల్లదనంలో ఉంచడం వల్ల పండే ప్రక్రియ నెమ్మదిస్తుంది. రిఫ్రిజిరేటర్ నుండి తీసిన వెంటనే టమోటాలను తినకూడదు. అవి గది ఉష్ణోగ్రతకు వచ్చినప్పుడు మాత్రమే తినాలి.
టమోటాలను కడగకుండా, ఆరబెట్టకుండా ప్లాస్టిక్ సంచులలో నిల్వ చేయకూడదు. దీనివల్ల అవి త్వరగా పాడైపోతాయి.
టమోటాలు పండినప్పుడు, అవి ఇథిలీన్ వాయువును విడుదల చేస్తాయి. అందువల్ల, బాగా పండిన టమోటాలను ఎక్కువగా ఒకేచోట నిల్వ చేయడం వల్ల అవి త్వరగా పాడైపోతాయి.
టమోటాలను అతి చల్లని ఉష్ణోగ్రతలలో నిల్వ చేయడం వాటి రుచిని పాడు చేస్తుంది. దీనివల్ల వాటి తొక్క బలహీనపడి, మరింత త్వరగా పాడైపోతాయి.
ప్రేమలో ఎప్పుడూ మోసపోతున్నారా? అయితే ఈ తప్పులు చేస్తున్నట్టే!
.