
ఏపీలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వాతావరణంలో వస్తున్న మార్పుల కు అనుగుణంగా అలర్ట్స్ జారీ చేసింది.
ట్రోపో ఆవరణములో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తుండటంతో రానున్న మూడు రోజులు పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. ఈదురుగాలులతో పాటుగా ఉరుములతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్షాల పైన హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో రాబోయే మూడ్రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో రాబోయే మూడ్రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.దీక్షలోకి పవన్ కళ్యాణ్- నిత్యం ఈ కఠిన నియమాలతో..!!ఈదురుగాలులతో వర్షాలుకాగా, ఉరుములతో పాటుగా ఈదురు గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందిని పేర్కొన్నారు. ఇక రాయలసీమ ప్రాంతంలోనూ రానున్న మూడు రోజులు పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. గంటకు 40 -50కిలోమీటర్ల వేంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని స్పష్టం చేసింది. పలు జిల్లాల్లో పిడుగులు కూడా పడే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద ఉండవద్దని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించింది. వర్షాల క్రమంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గముఖం పడుతున్నాయి. రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించినా.. విస్తరించక ఇప్పటి వరకు ఉక్కపోత పలు ప్రాంతాల్లో కొనసాగింది. తాజా వర్షాలతో కొంత ఉపశమనం దక్కే అవకాశం కనిపిస్తోంది.