
ఇంటర్నెట్ డెస్క్: రంగారెడ్డి రైజర్స్ రెండో వికెట్‌ను నష్టపోయింది. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ బౌలర్ అఖిల్ రాథోడ్ వేసిన బంతిని ఆరోన్ జార్జ్ (35) భారీ షాట్‌కు యత్నించాడు.
అయితే బంతి నేరుగా బౌండరీ లైన్ వద్ద ఉన్న గణేశ్ చేతుల్లో పడింది. దీంతో 95 పరుగుల వద్ద రంగారెడ్డి రెండో వికెట్‌ను నష్టపోయింది. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 12 ఓవర్లకు 98/2. క్రీజ్‌లో తనయ్ త్యాగరాజన్ (2*), ఆదిత్య (7*) ఉన్నారు.
రంగారెడ్డి రైజర్స్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్‌కు తొలి వికెట్ దక్కింది. హాఫ్ సెంచరీ చేసిన ఓపెనర్ అవనీశ్ (53)ను స్పిన్నర్ షణ్ముఖ అశ్విన్ ఔట్ చేశాడు. అతడు వేసిన 7.2వ ఓవర్లో అవనీశ్ భారీ షాట్‌కు యత్నించగా బౌండరీ లైన్‌వద్ద దొరికిపోయాడు. దీంతో 72 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం 8 ఓవర్లకు రంగారెడ్డి స్కోరు 79/1. క్రీజ్‌లో ఆదిత్య (1*), ఆరోన్ (20*) ఉన్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రంగారెడ్డి రైజర్స్ ఇన్నింగ్స్ దూకుడుగానే సాగుతోంది. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా ఆ జట్టు ఓపెనర్లు ఆరోన్ (17*), అవనీశ్ (22*) పరుగులు రాబడుతున్నారు. ప్రస్తుతం 4 ఓవర్లు ముగిసేసరికి రంగారెడ్డి వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది.
టీజీ20 లీగ్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ రెండో మ్యాచ్ బరిలోకి దిగింది. వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన రంగారెడ్డి రైజర్స్‌ను ఢీకొడుతోంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ బౌలింగ్ ఎంచుకుంది.
హైదరాబాద్: అన్విత్ రెడ్డి, అజయ్ దేవ్ గౌడ్, అభిరథ్ రెడ్డి (కెప్టెన్), గణేశ్ గడుగు, సాయి వికాస్ రెడ్డి, అర్వింద్, ప్రణవ్ శర్మ, శ్రీనికేత్, షణ్ముఖ అశ్విన్, అఖిల్ రాథోడ్, యశ్వీర్ గౌడ్
రంగారెడ్డి: అమన్‌రావు ఆరవెల్లి, ఆరోన్ వర్గీస్, తనయ్ త్యాగరాజన్ (కెప్టెన్), ఆలంకృత్ రాపోల్, జ్ఞాన ప్రకాశ్ రెడ్డి, ఆదిత్య జవ్వాజి, నితిన్ సాయి యాదవ్, రాకేశ్ నానావత్, అరుణ్ కుమార్, పున్నయ్య భువనగిరి, ఆర్యన్ కరియప్ప
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.