పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే మోస్ట్ స్టైలిష్ఢ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం రూ.
300 కోట్లకు పైగా కలెక్షన్లతో పవన్ కెరీర్లోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా రికార్డులకెక్కింది. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా రాబోతున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘ ఓజీ 2 ’ పనులు అధికారికంగా మొదలయ్యాయి. కేవలం సీక్వెల్ మాత్రమే కాకుండా, ఈ కథను ఒక భారీ ఫ్రాంచైజీగా మార్చుతూ ‘ఓజీ యూనివర్స్’ (#OGUniverse) కాన్సెప్ట్‌ను చిత్ర బృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేయడంతో నెట్టింట ఒక్కసారిగా తుపాను మొదలైంది.* ‘స్టూడెంట్ నెం.1’ కంటే ముందే మెగాఫోన్ పట్టిన రాజమౌళి... జక్కన్న ఫ్లాప్ సినిమా గురించి తెలుసా! స్క్రిప్ట్ చర్చల్లో పవన్, సుజీత్ "తుపాను రావడానికి ముందు ఒక నిశ్శబ్ద క్షణం ఉంటుంది.. ఈ గంభీరమైన కథలో ఇంకా చెప్పని ఎన్నో అధ్యాయాలు ఇప్పుడు తెరపైకి రానున్నాయి" అనే పవర్ఫుల్ క్యాప్షన్‌తో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఈ వీడియోను పంచుకుంది. అందులో దర్శకుడు సుజీత్, పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన తొలి క్రియేటివ్ మీటింగ్‌కు సంబంధించిన అరుదైన విజువల్స్ ఉన్నాయి. ఓజీ కథను భవిష్యత్తులో ఒక పెద్ద యూనివర్స్‌గా ఎలా విస్తరించాలనే అంశంపై వీరిద్దరూ లోతుగా చర్చిస్తున్న దృశ్యాలు అభిమానుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వీడియో చివర్లో పవన్ కళ్యాణ్ చాలా గంభీరంగా ‘నేను రెడీ’ అని చెప్పిన డైలాగ్ మెగా అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. దీనిని బట్టి ‘ఓజీ 2’ షూటింగ్ చాలా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందని స్పష్టమవుతోంది.* NBK: ఒకే ఏడాది ఆరు 100 డేస్ సినిమాలు... నందమూరి బాలకృష్ణ ఖాతాలో అల్‌టైమ్ రికార్డ్మరింత పవర్‌ఫుల్‌గా గ్యాంగ్‌స్టర్ వరల్డ్మొదటి భాగంలో చూపించిన గ్యాంగ్‌స్టర్ సామ్రాజ్యాన్ని ఈ సీక్వెల్లో మరింత విస్తృతంగా, సరికొత్త కోణంలో చూపించబోతున్నారని ట్రేడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా రాజకీయాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ కోసం ప్రత్యేకంగా డేట్స్ కేటాయించడంతో అభిమానుల్లో ఫుల్ జోష్ నెలకొంది. ఈ చిత్రానికి థమన్ మరోసారి తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్లను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ అప్డేట్తో సోషల్ మీడియాలో ‘ఓజీ 2’ హ్యాష్‌ట్యాగ్‌లు టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి.