పొత్తి కడుపు లోపల ఉండే అంతర్గత అవయవాల చుట్టూ పేరుకుపోయిన కొవ్వును విసెరల్ ఫ్యాట్ అని పిలుస్తారు. ఇది ముఖ్యంగా కాలేయం, పేగులు, క్లోమం చుట్టూ పేరుకుపోతుంది.
ఈ కొవ్వు పెరగడం వల్ల డయాబెటిస్, గుండెపోటు, కాలేయ సమస్యలు వస్తాయి. ఇలాంటి కొవ్వు తగ్గించుకోవడం కోసం ఇంట్లోనే ఈ వ్యాయామాలు చేయడం మంచిదని ఫిట్నెస్ ట్రైనర్ అశ్లేష జోషి పేర్కొన్నారు. అవేంటో చూద్దాం.
మౌంటేన్ క్లైంబర్స్ ఎక్సర్సైజ్ రెగ్యులర్‌గా చేయడం వల్ల పొత్తి కడుపుపై ఒత్తిడి పెరిగి కొవ్వు తొందరగా కరిగిపోతుంది. కేలరీల ఖర్చు పెరిగి ప్యాట్ ఈజీగా తగ్గించుకోవచ్చు. అలాగే బరువు తగ్గుతారు. గుండె హెల్తీగా ఉంటుంది.
గండె వేగం పెంచి కేలరీల ఖర్చును రెట్టింపు చేయడంలో జంపింగ్ జాక్స్ సహాయపడతాయి. ఈ ఎక్సర్సైజ్ రోజూ చేయడం వల్ల విసెరల్ ఫ్యాట్ సులువుగా కరిగించుకోవచ్చు.
రష్యన్ ట్విస్ట్ చేయడం ద్వారా వెన్నెముక, పొత్తి కడుపుపై ఒత్తిడి పెరిగి కొవ్వు సులువుగా కరిగిపోతుంది. దీంతో అంతర్గత అవయవాల దగ్గర కొవ్వు తొందరగా తగ్గుతుంది.
ప్లాంక్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా పూర్తి బాడీపై ఒత్తిడి పడుతుంది. దీంతో కేలరీలు ఖర్చయిపోయి కొవ్వు తగ్గుతుంది. తద్వారా హెల్తీగా, ఫిట్‌గా ఉంటారు. రోజూ కనీసం ఒక నిమిషం ప్లాంక్ పొజిషన్లో ఉంటే చాలా మంచిది.
ఈ ఆసనం వేయడం ద్వారా పొత్తి కడుపుపై ఒత్తిడి పెరిగి ఆ ప్రాంతంలోని కొవ్వు తగ్గుతుంది. దీంతో బెల్లీ ఫ్యాట్‌తో పాటు విసెరల్ ఫ్యాట్ ఈజీగా తగ్గించుకోవచ్చు.
స్క్వాట్, జంపింగ్, పుష్ అప్స్ ఈ మూడింటి కలయికే బర్పీస్. ఈ వ్యాయామం రోజూ చేయడం ద్వారా కేలరీల తొందరగా ఖర్చయిపోతాయి. దీంతో కొవ్వు తగ్గుతుంది. అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి.
ఒక చోట నిల్చుని కాళ్లను ఛాతి ఎత్తుకు లేపాలి. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల పొత్తి కడుపు లోపల అవయవాల చుట్టూ కొవ్వు కరిగిపోతుంది. గుండె, కాలేయం ఆరోగ్యంగా ఉంటాయి.
విపరీత కరణి వ్యాయామం చేయడం ద్వారా వెన్నెముక, పొత్తి కడుపు దగ్గర కొవ్వును ఈజీగా కరిగించుకోవచ్చు. తద్వారా హెల్తీగా, ఫిట్‌గా ఉంటారు.