కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆ సత్యదేవుని అన్నప్రసాదాన్ని.. ఆలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాసంస్థల్లో విద్యార్థులకు మధ్యాహ్నం అంది
ంచాలని నిర్ణయించారు. అన్నవరంలో దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కూల్, జూనియర్, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు అన్నప్రసాదం అందిస్తారు. అన్నవరంలో ఉన్న హైస్కూల్లో 150 విద్యార్థులకు ఇప్పటికే ప్రతిరోజూ మధ్యాహ్న భోజనంలో భాగంగా భక్తులకు అందించే అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు. విద్యార్థులకు అందించే అన్నప్రసాదం మెనూలో స్వామి గోధుమనూక ప్రసాదం, రైస్, ఒక కూర, పప్పు, పచ్చడి, సాంబారు, మజ్జిగ అందిస్తున్నారు.అన్నవరంలో దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జూనియర్, డిగ్రీ కాలేజీలకు ఇతర ప్రాంతాల నుంచి విద్యార్థులు వస్తున్నారు. ఈ క్రమంలో జూనియర్ కాలేజీలో 200 మందికి, డిగ్రీ కాలేజీలో 300 మందికి కూడా ప్రతిరోజూ మధ్యాహ్న భోజనంగా అన్నప్రసాదం పంపిణీ చేయాలని తాజాగా పాలకమండలి సమావేశంలో నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధికి చేస్తున్న చర్యల్లో భాగంగా.. జూనియర్, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు అన్నప్రసాదం అందించాలని ఆలయ పాలకమండలి ఛైర్మన్ రోహిత్, ఈవో చక్రధరరావు, సభ్యులు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే జూనియర్, డిగ్రీ కాలేజీల్లో అన్నప్రసాదం వితరణను ప్రారంభించనున్నారు. అననవరంలో భక్తులకు అందించే అన్నప్రసాదం మెనూలోనివి అందిస్తారు.పాలకమండలి సమావేశంలో అన్నవరం ఆలయానికి ఈ-ప్రోక్యూర్మెంట్ టెండర్ల ద్వారా నెయ్యి కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సత్యదేవుని గోధుమనూక ప్రసాదం తయారీకి నెయ్యిని ఉపయోగిస్తారు. ఈ మేరకు ఈ-ప్రోక్యూర్మెంటు టెండర్ల ప్రక్రియ ద్వారా కిలో రూ. 647.80 చొప్పున నెయ్యిని కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. విజయ బ్రాండ్ (ది కృష్ణా డిస్ట్రిక్ట్ మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్) నుంచి ఈ నెయ్యి కొనుగోలు చేయనున్నారు. అన్నవరంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు, కవర్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని నిర్ణయించారు. అన్నవరం ఆలయ పాలకమండలి సమావేశంలో.. ఈ రెండిటితో పాటుగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.