
ప్రపంచం సాంకేతికంగా ఎంత ముందుకు దూసుకుపోతున్నా, అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపుతున్నా.. భూమిపై ఉన్న కోట్లాది మంది ప్రజలకు కనీస విద్యుత్ సౌకర్యం కూడా అందడం లేదనేది చేదు నిజం.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ దాదాపు 65.5 కోట్ల మంది ప్రజలు (ప్రపంచ జనాభాలో 8 శాతం) కరెంట్ లేని చీకటి జీవితాలనే గడుపుతున్నారని ఐరాస భాగస్వామ్య సంస్థలు విడుదల చేసిన తాజా 'ట్రాకింగ్ SDG 7: ది ఎనర్జీ ప్రోగ్రెస్ రిపోర్ట్ 2026' వెల్లడించింది. జూన్ 24న విడుదలైన ఈ నివేదిక ప్రకారం.. గత పదేళ్లతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే ప్రక్రియ వేగం భారీగా మందగించింది. 2023, 2024 మధ్య కాలంలో కేవలం 1.15 కోట్ల మందికి మాత్రమే కొత్తగా విద్యుత్ సౌకర్యం లభించింది. ఈ వేగం అంతకుముందు దశాబ్దపు సగటు వేగంతో పోలిస్తే సగం మాత్రమే కావడం ఆందోళన కలిగిస్తోంది.ఆఫ్రికాలోనే అత్యధికంఈ విద్యుత్ కొరత ప్రభావం అత్యధికంగా సబ్-సహారన్ ఆఫ్రికాలోని గ్రామీణ, తక్కువ ఆదాయం ఉన్న, అంతర్గత ఘర్షణలు ఎదుర్కొంటున్న ప్రాంతాలపై పడింది. ప్రపంచవ్యాప్తంగా కరెంట్ లేని వారిలో అత్యధికులు ఈ ప్రాంతానికి చెందినవారే.మరోవైపు, విద్యుత్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మంది ప్రజలు ఇప్పటికీ వంట కోసం కాలుష్యాన్ని వెదజల్లే సంప్రదాయ ఇంధనాలపై (కట్టెలు, బొగ్గు వంటివి) ఆధారపడుతున్నారని నివేదిక స్పష్టం చేసింది. "65.5 కోట్ల మందికి కరెంట్ లేదు, మరో 200 కోట్ల మంది కాలుష్య కారక ఇంధనాలతో వంట చేస్తూ తమ ఆరోగ్యాన్ని, ప్రాణాలను పణంగా పెడుతున్నారు"