
NBK 112 : నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. బాలయ్య కెరీర్లో 112 మూవీగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది.
Nandamuri Balakrishna NBK 112 movie started with pooja ceremony
NBK 112 : నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. బాలయ్య కెరీర్లో 112 మూవీగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. తాజాగా అమరావతిలోని వెంకటాయపాలెంలో ఉన్న ప్రసిద్ధ టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ చిత్రం (NBK112) పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మంత్రి నారా లోకేష్ క్లాప్ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించగా బాలయ్య అదిరిపోయే డైలాగ్‌ను చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే శ్రావణ్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని 150 నుంచి 200 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా ఎంటర్ టైనర్‌గా నిర్మించనున్నట్లు తెలిపారు. ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది, 2027 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచన ఉందన్నారు.
Patas faima : పటాస్ ఫైమా హల్దీ సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్..
రాక్‌స్టార్ అనిరుధ్ సంగీతాన్ని అందిస్తుండగా ఎస్ఎల్వీ సినిమాస్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ చేరుకూరి, సుధాకర్ మిక్కిలినేని లు నిర్మిస్తున్నారు. బాలయ్య రేంజ్ మాస్ ఎలివేషన్లకు, కొరటాల శివ మార్క్ సోషల్ మెసేజ్ తోడు కానుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.