
ఫిఫా ప్రపంచకప్-2026 నాకౌట్ దశకు సౌతాఫ్రికా అర్హత సాధించింది. గ్రూప్- ‘ఎ’లో భాగంగా సౌత్ కొరియాతో జరిగిన మ్యాచ్లో 1-0తో గెలుపొంది.. తొలిసారి నాకౌట్ బెర్తు ఖరారు చేసుకుంది.
Jun 25 2026 9:10 AM | Updated on Jun 25 2026 9:21 AM
ఫిఫా ప్రపంచకప్-2026 నాకౌట్ దశకు సౌతాఫ్రికా అర్హత సాధించింది. గ్రూప్- ‘ఎ’లో భాగంగా సౌత్ కొరియాతో జరిగిన మ్యాచ్లో 1-0తో గెలుపొంది.. తొలిసారి నాకౌట్ బెర్తు ఖరారు చేసుకుంది. మ్యాచ్ తొలి అర్ధ భాగం గోల్ లేకుండానే 0-0తో ముగిసింది.
రెండో అర్ధ భాగంలో సౌతాఫ్రికా తరఫున తాపెలో మసేకో గోల్ కొట్టడంతో జట్టు ఆధిక్యం 1-0కు చేరింది. నిజానికి బంతి ఎక్కువ సేపు కొరియా తమ ఆధీనంలో ఉంచుకున్నప్పటికీ గోల్ మాత్రం కొట్టలేకపోయింది.
ఫలితంగా మెక్సికోలోని మాంటెర్రీ వేదికగా కొరియా అభిమానుల మధ్య సౌతాఫ్రికా అనూహ్య రీతిలో విజయం సాధించి.. తొలిసారి ప్రపంచకప్ నాకౌట్ దశలో అడుగుపెట్టింది.
టాపర్గా మెక్సికో మరో మ్యాచ్లో.. ఇప్పటికే నాకౌట్ దశకు అర్హత సాధించిన మెక్సికో.. తాజాగా చెక్ రిపబ్లిక్పై 3-0తో ఏకపక్ష విజయం సాధించింది. మెక్సికో తరఫున మేటో చావెజ్ 55వ, జూలియన్ క్వినోన్స్ 61వ నిమిషంలో గోల్స్ కొట్టగా.. అల్వారో ఫిడాల్గో అదనపు సమయం (90+4)లో గోల్ కొట్టాడు. ఫలితంగా ఆతిథ్య మెక్సికో చెక్ రిపబ్లిక్ చిత్తుగా ఓడించింది.
తద్వారా గ్రూప్- ‘ఎ’ టాపర్గా తమ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు.. చెక్ రిపబ్లిక్ను ఎలిమినేట్ చేయడంతో.. సౌతాఫ్రికాకు మార్గం సుగమమైంది. గ్రూప్- ‘ఎ’ సెకండ్ టాపర్గా సౌతాఫ్రికా కూడా మెక్సికోతో పాటు నాకౌట్ దశకు చేరుకుంది. ఇక కొరియాకు మరో అవకాశం మిగిలి ఉంది. ప్రతీ గ్రూపులోని నాలుగు జట్ల నుంచి టాప్-3లో నిలిచిన జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయన్న సంగతి తెలిసిందే.
39 సెకన్ల తేడాతో.. వెనెజువెలాలో మహా విధ్వంసం! (ఫొటోలు)
హైదరాబాద్ : మాయజేసినట్టే.. వాన కొట్టే.. (ఫొటోలు)
‘సూపర్ సుబ్బు’ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
పులివెందులలో రెండో రోజు వైఎస్ జగన్ పర్యటన (ఫొటోలు)
కూల్ డ్రింక్ ఇస్తేనే ఫోన్ ఇస్తా అంటున్న కోతి
మానవత్వం చాటుకున్న వైఎస్ జగన్.. కాన్వాయ్ అపి మరీ...