సోరియాసిస్ వల్ల కలిగే దురదను తగ్గించడానికి బేకింగ్ సోడా ఎంతో సహాయపడుతుందని NLM అధ్యయనం పేర్కొంది. ఒక అర బకెట్ నీటిలో ముప్పావు కప్పు బేకింగ్ సోడా వేసి కరిగించండి.
ఈ నీటిలో శుభ్రమైన వస్త్రాన్ని నానబెట్టి, దాన్ని పిండండి. ఈ వస్త్రాన్ని ప్రభావిత ప్రాంతంలో ఉంచండి. ఈ ప్రాసెస్‌ను రిపీట్ చేయండి. ఇలా తరచుగా చేస్తూ ఉంటే దురద నుంచి ఉపశమనం లభిస్తుంది.
సోరియాసిస్ లక్షణాల నుంచి ఉపశమనం పొందడానికి మనకు సులభంగా లభించే కొబ్బరి నూనె అద్భుతంగా సహాయపడుతుంది. సోరియాసిస్ పేషెంట్స్ ప్రతిరోజూ 2 టేబుల్ స్పూన్ల మంచి కొబ్బరి నూనె తాగితే మంచిదని నిపుణులు అంటున్నారు. (అయితే దీనిని పాటించే ముందు డాక్టర్ల సలహా తీసుకోవడం మంచిది) నేరుగా కొబ్బరి నూనెను తీసుకోవచ్చు లేదా ఫ్రూట్ స్మూతీస్‌లో కూడా దీన్ని వేసుకుని తీసుకోవచ్చు. వంట చేసేప్పుడు కొబ్బరి నూనెను వాడుకోవచ్చు కూడా. అంతేకాదు ప్రభావిత ప్రాంతంలో రోజుకు 3 సార్లు కొబ్బరి నూనెను అప్లయ్ చేయడం కూడా మంచిది.
సోరియాసిస్ ఇన్ఫ్లమేషన్ను తగ్గించడానికి చామంతి టీ సహాయపడుతుంది. అలాగే సోరియాసిస్ గడ్డలు మరింత పెరగకుండా ఇది నిరోధిస్తుందని నిపుణులు అంటున్నారు. గుప్పెడు చామంతి పువ్వులు తీసుకుని నాలుగు కప్పుల నీటిలో వేసి మరగబెట్టండి. ఈ మిశ్రమాన్ని గోరువెచ్చని నీటితో నిండిన బాత్‌టబ్‌లో కలపండి. అది బాత్‌టబ్ అంతటా సమానంగా వ్యాపించేలా బాగా తిప్పండి, ఆ తర్వాత సుమారు 20 నిమిషాల పాటు ఆ టబ్‌లో రెస్ట్ తీసుకోండి. ఇది ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందట.
చాలా మంది వైద్యులు సోరియాసిస్‌తో బాధపడుతున్న రోగులకు అర్టిఫిషియల్ అల్ట్రావైలెంట్ లైట్ చికిత్సలను సూచిస్తారు. దీనికి తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయం ఏమిటంటే ఎక్కువసేపు సూర్యరశ్మిలో ఉండండి. రోజుకు కనీసం 5-10 నిమిషాల పాటు ఎండలో ఉండండి. క్రమంగా ఎండలో ఉండే సమయాన్ని పెంచండి కానీ మితిమీరిన ఎండ తగలకుండా చూసుకోండి. వ్యాధి సోకని భాగాలకు సన్‌స్క్రీన్‌ను ఉపయోగించండి. సూర్యరశ్మికి గురికావడం వల్ల విటమిన్ డి ఉత్పత్తి పెరుగుతుంది. ఇది సోరియాసిస్ చికిత్సలో ఎంతో సహాయపడుతుందని NLM అధ్యయనం పేర్కొంది.
సోరియాసిస్ కారణంగా చర్మంపై పొరలు పేరుకుపోవడాన్ని అరికట్టడానికి పెట్రోలియం జెల్లీ సహాయపడుతుంది. ఇది చర్మానికి తేమను అందిస్తుంది. సమస్య ఉన్న ప్రాంతాల్లో, ముఖ్యంగా స్నానం చేసిన తర్వాత ప్రతిరోజూ కొద్ది మొత్తంలో దీనిని రాస్తూ ఉండండి. స్నానం చేసిన కొద్ది నిమిషాల్లోనే మాయిశ్చరైజర్‌ను రాసుకోవడం కూడా చాలా ముఖ్యం.
ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే వీటిని పాటించడం, పాటించకపోవడం పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది కూడా పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.
రచయిత గురించికిషోర్ రెడ్డికిషోర్ రెడ్డి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2020లో సమయం తెలుగులో చేరిన కిషోర్ రెడ్డి లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన న్యూట్రిషియన్, డైట్ ప్లాన్, రోగాలు - లక్షణాలు, ఫిట్నెస్, ఇంటి చిట్కాలు, ఫ్యాషన్, హోమ్ డెకార్, రిలేషన్షిప్ వార్తలతో పాటు వివిధ ఆరోగ్య అంశాలపై ఆరోగ్య నిపుణులు, న్యూట్రిషనిస్ట్, డైటీషియన్లు, ఆయుర్వేద నిపుణులు ఇచ్చిన సలహాలు, సమాచారం ఆధారంగా విస్తృత స్థాయిలో వార్తల్ని రాశారు. అంతేకాకుండా క్లీవ్ ల్యాండ్ క్లినిక్, మాయో క్లినిక్, WHO, హార్వర్డ్ వంటి పరిశోధనలు ఆధారంగా కూడా కంటెంట్ అందించారు. ఈ సమాచారాన్ని నిజమో కాదో తెలుసుకోవడానికి నిపుణుల సలహా తీసుకోమని కూడా వివరించారు. ఈ ఆర్టికల్స్ పాఠకులకు అర్థమయ్యేలా సరళమైన భాషలో రాస్తారు.కిషోర్ రెడ్డి 2015లో సాక్షి జర్నలిజం స్కూల్లో జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం సాక్షి న్యూస్ ఛానెల్లో (20.08.2016 నుంచి 23.03.2020 వరకు) సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్, విద్య, ఉద్యోగం వార్తలు రాశారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ / జాబ్స్ సెక్షన్ చూసుకునేవారు. ఆ తర్వాత 02.04.2020 నుంచి సమయం తెలుగులో విద్య, ఉద్యోగ వార్తలతో పాటు టెక్నాలజీ న్యూస్, అడ్వర్టయిజ్‌మెంట్స్ కూడా రాశారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, ప్రముఖల ఇంటర్వ్యూలు చూడటం, కొత్త కొత్త అంశాల గురించి తెలుసుకోవడానికి ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి