
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Ram Charan Meets Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా ఒక అరుదైన, ఆసక్తికరమైన భేటీ జరిగింది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కథానాయకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఆయనను మంగళగిరి కార్యాలయంలో చరణ్ కలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ 'బాబాయ్-అబ్బాయి'ల ప్రత్యేక సమావేశం ప్రస్తుతం అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సినీ సర్కిల్స్‌లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఘనస్వాగతం..ఆత్మీయ ముచ్చట్లు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న రామ్ చరణ్‌కు జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పవన్ కళ్యాణ్‌ను కలిసి చరణ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి ప్రస్తుత పరిణామాలు, పలు ఆసక్తికర విషయాలపై కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు.
చరణ్ అమరావతి పర్యటనకు కారణం? రామ్ చరణ్ అమరావతికి రావడం వెనుక ఒక ప్రత్యేక కారణం ఉంది. ఇక్కడ జరుగుతున్న ప్రతిష్టాత్మక ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్ (APL) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మంగళగిరిలోని ఏసీఏ (ACA) అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి వెళ్లే ముందే.. రామ్ చరణ్ నేరుగా జనసేన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ బాబాయ్ పవన్ కళ్యాణ్ ఆశీస్సులు తీసుకున్న తర్వాతే ఆయన క్రికెట్ స్టేడియం వైపు అడుగులు వేశారు.
సోషల్ మీడియాలో ట్రెండింగ్! జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు నెట్టింట ప్రత్యక్షమవ్వడమే ఆలస్యం.. సోషల్ మీడియా షేక్ అవుతోంది. మెగా అభిమానులు లైకులు, షేర్ల వర్షం కురిపిస్తూ ఈ విజువల్స్‌ను టాప్ ట్రెండింగ్‌లో నిలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.