
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ (AIIMS) సంస్థలు, కేంద్ర ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఖాళీగా ఉన్న 1,484 నాన్-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను...
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ (AIIMS) సంస్థలు, కేంద్ర ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఖాళీగా ఉన్న 1,484 నాన్-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థలు, అనుబంధ కేంద్ర ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఖాళీగా ఉన్న 1,484 నాన్-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గ్రూప్-బీ, గ్రూప్-సీ కేటగిరీలకు చెందిన ఈ నియామకాలు కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ (CRE-2026) ద్వారా చేపట్టనున్నారు.
ఈ నియామక ప్రక్రియలో మొత్తం 59 రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు వివిధ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు తమ అర్హతలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు జులై 3, 2026లోపు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి.
ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో ఎంఎస్సీతో పాటు సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవం అవసరం. గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు.
హోమ్ సైన్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లేదా డైటెటిక్స్లో పీజీ అర్హతతో పాటు మూడేళ్ల అనుభవం ఉండాలి.
డిగ్రీతో పాటు హోమ్ సైన్స్ డిప్లొమా, రెండేళ్ల అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ / ఆఫీస్ అసిస్టెంట్
ఇంటర్మీడియట్ పూర్తి చేసి, కంప్యూటర్ టైపింగ్ నైపుణ్యం కలిగిన అభ్యర్థులు అర్హులు.
డిగ్రీతో పాటు కంప్యూటర్ ఆధారిత కార్యాలయ పనులపై అవగాహన ఉండాలి.
సివిల్, ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజినీరింగ్లో డిగ్రీ లేదా డిప్లొమా అర్హత అవసరం.
ఫార్మసీ డిప్లొమాతో పాటు సంబంధిత రిజిస్ట్రేషన్ ఉండాలి.
అదనంగా టెక్నీషియన్, ల్యాబ్ టెక్నాలజిస్ట్, స్టెనోగ్రాఫర్, స్టోర్ కీపర్, అకౌంట్స్ పోస్టులు సహా పలు విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ఆధారంగా జరుగుతుంది. పరీక్షలో 100 ప్రశ్నలు ఉండగా మొత్తం 400 మార్కులు కేటాయించారు. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు లభిస్తాయి. తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. కొన్ని పోస్టులకు అదనంగా స్కిల్ టెస్ట్ నిర్వహించనున్నారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి తుది ఎంపిక చేపడతారు.
ఎస్సీ / ఎస్టీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు: రూ.2,400
పోస్టును బట్టి లెవెల్-2 నుంచి లెవెల్-7 పే స్కేల్ ప్రకారం జీతభత్యాలు అందించనున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ కోసం AIIMS అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.
న్యూజిలాండ్ క్రికెట్లో విషాదం.. ఐకానిక్ ప్లేయర్ మృతి
SIR జాబితా నుంచి పేరు తొలగిస్తే రేషన్ ఇవ్వరా?.. సుప్రీంకోర్టు ఆశ్చర్యం