
ఇంటర్నెట్ డెస్క్: కేవలం 15ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు ఎంపికైన వైభవ్ సూర్యవంశీకి ఇంగ్లాండ్‌లో స్వల్ప అవరోధం కలగనుంది.
ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వైభవ్‌తోపాటు అతడి తల్లిదండ్రులు వెళ్లేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇంగ్లాండ్‌లో మాత్రం వైభవ్ సూర్యవంశీకి భారత డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండే అవకాశం లేకుండా పోతుందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. దానికి కారణం అక్కడి నిబంధనలేనని తెలుస్తోంది. జులై 1 నుంచి ఇంగ్లాండ్‌లో టీమ్ఇండియా పర్యటించనుంది. ఐసీసీ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిబంధనల ప్రకారం 16 ఏళ్లలోపు ఆటగాళ్లకు ప్రత్యేక గదులు కేటాయిస్తారు. అయితే, ఈ విషయంపై బీసీసీఐ అధికారులు ఇంగ్లాండ్ బోర్డు ప్రతినిధులతో చర్చించే అవకాశం ఉంది.
‘‘ఇది ఐసీసీ ఈవెంట్. వారి అధికార పరిధి ఉన్నందున భద్రతా విధానాలు అమల్లో ఉంటాయి. 16 ఏళ్లలోపు ప్లేయర్లు పెద్దల ఛేంజింగ్ రూమ్స్‌ను వాడేందుకు అనుమతి లేదు. కాబట్టి, సూర్యవంశీకి ప్రత్యేకంగా గదిని కేటాయించే అవకాశం ఉంది. అతడితోపాటు తల్లిదండ్రులు కూడా వస్తారు. వారికి కూడా ప్రతి వేదిక వద్ద వసతి సదుపాయం కల్పిస్తాం. మ్యాచ్ సమయంలోనే వైభవ్‌కు డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లేందుకు అనుమతి ఉంది. మ్యాచ్‌కు ముందు.. తర్వాత ఛేంజింగ్ కోసం వెళ్లడానికి అనుమతి ఉండదు’’ అని ఈసీబీ క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హైదరాబాద్ : ఉప్పల్ వేదికగా టీజీ 20 లీగ్‌లో అన్విత ఖమ్మం ఏసెస్, వరంగల్ వారియర్స్ జట్ల మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఆ చిత్రాలను మీరూ చూసేయండి..