
ఒకప్పుడు చార్మినార్, గోల్కొండ కోటల చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలిచిన హైదరాబాద్.. ఇప్పుడు సరికొత్త గ్లోబల్ రూపాన్ని సంతరించుకుంది.
పాతబస్తీ నవాబుల కాలం నాటి వారసత్వం నుండి, ఐటీ హబ్‌ల ఆధునికతను దాటుకుని, నేడు అంతర్జాతీయ నగరాలైన దుబాయ్, న్యూయార్క్ తరహాలో ఆకాశహర్మ్యాల (Skyscrapers) నగరంగా శరవేగంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఐటీ హబ్ గా మారిన పశ్చిమ హైదరాబాద్ లోని కోకాపేట, పుప్పాలగూడ, గచ్చిబౌలి, నియోపోలిస్ ప్రాంతాలు హైదరాబాద్‌ను నిలువుగా విస్తరింపజేస్తున్నాయి. ఈ ప్రాంతాల గుండా వెళ్తుంటే మేఘాలను తాకుతున్నట్లుగా నిర్మిస్తున్న భారీ భవనాలు చూసేవారిని అబ్బురపరుస్తాయి.
ఇప్పటికే హైదరాబాద్ లో ఎత్తైన భవానాలు అనేకం ఉన్నాయి... 10, 20, 30 అంతస్తుల భవనాలకు లెక్కేలేదు. కానీ వీటన్నింటిని తలదన్నేలా నగరంలో ఆకాశహర్మ్యాల నిర్మాణం జరుగుతోంది. హైదరాబాద్ ఐడెంటిటీని మార్చేస్తూ, ఆకాశమే హద్దుగా నిలుస్తున్న టాప్ 10 అత్యంత ఎత్తైన భవనాలు ఏవో, వాటిని ఏ నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్నాయో తెలుసుకుందాం.
ఇది పుప్పాలగూడలో ఉంది. 243.7 మీటర్లు ఎత్తులో 59 అంతస్తుల్లో కాండ్యూర్ కన్స్ట్రక్షన్స్ (Candeur) దీన్ని నిర్మిస్తోంది. మొత్తం 4 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 282 ప్లాట్స్ తో ఉంటుంది.
నియోపాలిస్ ప్రాతంలో 239.9 మీటర్లు ఎత్తులో ఈ భారీ అపార్ట్ మెంట్ నిర్మిస్తున్నారు... మొత్తం 63 అంతస్తులు ఉటుంది. ఇ-ఇన్ఫ్రా & పివిఆర్ గ్రూప్ (e-infra & PVR) దీన్ని నిర్మిస్తోంది.
కోకాపేటలో 235.3 మీటర్ల ఎత్తు, 58 అంతస్తుల్లో ఎస్ఏఎస్ ఇన్ఫ్రా (SAS Infra) నిర్మిస్తోంది. ఇది కూడా 4 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో 248 వరకు ప్లాట్స్ ఉండే అవకాశాలున్నాయి.
నియోపాలిస్ లో 220.83 మీటర్లు ఎత్తు 57 అంతస్తులల్లో ఎంఎస్ఎన్ గ్రూప్ (MSN) ఈ వన్ బై ఎంఎస్ఎన్ నిర్మిస్తోంది. ఈ అపార్ట్మెంట్ లో 655 ప్లాట్స్ ఉంటాయి.
5. ది క్యాస్కేడ్స్ నియోపోలిస్ (The Cascades Neopolis)
ఇది కూడా నియోపాలిస్ లో ఉంది... 218 మీటర్ల ఎత్తులో 59 అంతస్తుల్లో ఉంటుంది. GHR, లక్ష్మీ ఆండ్ అర్బన్ సంస్థ నిర్మిస్తోంది. 7 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వెయ్యికి పైగా ప్లాట్స్ తో నిర్మిస్తున్న ఆకాశహర్మ్యం ఇది.