
న్యూజిలాండ్ క్రికెట్లో విషాదం చోటు చేసుకుంది. కివీస్ ఐకానిక్ క్రికెటర్ బాబ్ బ్లేయర్ తుది శ్వాస విడిచారు. ఆయనకు పలువురు స్టార్ క్రికెటర్లు సంతాపం తెలియజేశారు.
స్పోర్ట్స్ డెస్క్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సోదరుడు షాహిద్ అక్తర్ మరణవార్త మరవక ముందే క్రికెట్ ప్రపంచంలో మరో విషాదం చోటుచేసుకుంది. న్యూజిలాండ్ ఐకానిక్ క్రికెటర్ బాబ్ బ్లేయర్ కన్నుమూశారు. తన 94వ పుట్టినరోజే ఇంగ్లండ్‌తో ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా బ్లేయర్ కివీస్ తరఫున 1953- 1964 మధ్య 19 టెస్టులు ఆడి.. 35.23 సగటుతో 43 వికెట్లు పడగొట్టారు.
ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో వెల్లింగ్టన్ జట్టుకు చాలాకాలం పాటు ప్రాతినిథ్యం వహించిన బాబ్ బ్లేయర్.. 119 మ్యాచ్‌ల్లోనే 537కి పైగా వికెట్లు సాధించారు. 1956-57 సీజన్లో మొత్తంగా 46 వికెట్లు కూల్చి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన బౌలర్‌గా నిలిచాడు. అదే సీజన్లో ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు తొమ్మిది వికెట్ల ప్రదర్శన నమోదు చేసి క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.
న్యూజిలాండ్ జట్టు 1953లో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఆ ఏడాది క్రిస్మస్ పండుగ ముందు రోజు రాత్రి టాంగివాయి రైలు ప్రమాదంలో బ్లేయర్‌కు కాబోయే భార్య నెరిస్సా లవ్ మృతి చెందారు. ఓ ఎక్స్‌ప్రెస్ రైలు వెల్లింగ్టన్ నుంచి ఆక్లాండ్‌కు వెళ్తున్న సమయంలో వంతెన కూలిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 151 మంది మరణించారు. అప్పుడు బ్లేయర్‌కు 21 ఏళ్లు. అయినప్పటికీ జట్టు కోసం బాధ దిగమింగిన బ్లేయర్ పదో నంబర్ బ్యాటర్‌గా రంగంలోకి దిగారు.
బెర్ట్ సట్లిఫ్తో కలిసి ఆఖరి వికెట్‌కు 33 పరుగుల జోడించారు. సౌతాఫ్రికా స్పిన్నర్ హూ టేఫీల్డ్ బౌలింగ్‌లో సింగిల్ ఓవర్లోనే 25 పరుగులు రాబట్టడం అనాడు ప్రపంచ రికార్డు. అలా వ్యక్తిగత విషాదం ఎదురైనప్పటికీ, క్రీజులోకి వచ్చిన బ్లెయిర్ ప్రదర్శన పట్టుదల , క్రీడాస్ఫూర్తికి ప్రతీకగా నిలిచింది. 1964లో క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. చివరకు అతడు క్వీన్స్లాండ్, జింబాబ్వే, సౌతాఫ్రికా, నార్తర్న్ ఐర్లాండ్, ఇంగ్లండ్ జట్లకు కోచ్‌గానూ వ్యవహరించారు.
టీమిండియా యువ హిట్టర్ వైభవ్‌పై కపిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఐసీసీ ర్యాంకింగ్స్: రెండో స్థానానికి దూసుకెళ్లిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్