కడపులోని యాసిడ్ అన్నవాహిక పొరపైకి చిమ్మడం వల్ల ఛాతీ, గొంతు మధ్యలో మంటగా ఉంటుంది. యాసిడ్ రిఫ్లక్స్‌ను నిర్లక్ష్యం చేస్తే తీవ్ర సమస్యగా మారుతుంది.
కడుపులోని యాసిడ్ తిరిగి ప్రవహించడం వల్ల సున్నితమైన అన్నవాహిక పొర క్షీణించిపోతుంది.
దీంతో ఆహారం మింగడం కష్టం అవుతుంది. GERD వల్ల అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ఈ యాసిడ్ రిఫ్లక్స్ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చని హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ అధ్యయనం పేర్కొంది.
కొంతమందికి యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నా ఛాతీలో మంట వంటి లక్షణాలు కనిపించవు. ఛాతీ నొప్పి, గురక, గొంతు బొంగురుగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, నోరు చేదుగా అనిపించడం, పొడి దగ్గు, నిద్రకు అంతరాయం, గొంతు టైట్‌గా ఉండటం, నోటి దుర్వాసన వంటి లక్షణాలు ఉంటాయి.
ఇంట్లోనే యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను తగ్గించడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ అద్భుతంగా సహాయపడుతుంది. యాసిడ్ రిఫ్లక్స్ సమస్యను తగ్గించడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ వంటి ఎసిడిక్ పదార్థం తీసుకోవడం మీకు వింతగానే అనిపించొచ్చు. కానీ యాసిడ్స్‌లో మంచివి, చెడ్డవి ఉంటాయి. అర గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి మిక్స్ చేయండి. రాత్రి భోజనం చేసేటప్పుడు ఈ గ్లాసు నీటిని తీసుకోండి. ఇది మీ సమస్యను తగ్గిస్తుంది.
మన భారతీయ వంటల్లో అల్లం ఎక్కువగానే వాడుతుంటాం. అల్లం కడుపులోని యాసిడ్‌ను పీల్చుకుంటుంది. అంతేకాదు, నరాలను రిలాక్స్ చేస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను తగ్గించడానికి అల్లం ఎంతగానో సహాయపడుతుంది. మీరు భోజనం చేశాక కొంచెంసేపు ఆగి అల్లం టీ తీసుకోండి. ఇది యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను తగ్గిస్తుంది.
సోంపు మన జీర్ణ వ్యవస్థను మెరుగ్గా పనిచేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాదు సోంపు గింజలలో అనెథోల్ అనే కాంపౌడ్ ఉంటుంది. ఇది కడుపు, జీర్ణాశయ నాళంలో వచ్చే నొప్పులను తగ్గిస్తుంది. సోంపు యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఒక కప్పు మరిగే నీటిలో అర టీ స్పూన్ సోంపు గింజలను వేసి 3 నుంచి 5 నిమిషాల పాటు మరగనివ్వండి. నీటిని వడకట్టి, ఆ తర్వాత కొంచెం తేనె కలిపి తాగండి.
ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోండి. అలాగే వీటిని పాటించడం, పాటించకపోవడం పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది కూడా పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.
రచయిత గురించికిషోర్ రెడ్డికిషోర్ రెడ్డి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2020లో సమయం తెలుగులో చేరిన కిషోర్ రెడ్డి లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన న్యూట్రిషియన్, డైట్ ప్లాన్, రోగాలు - లక్షణాలు, ఫిట్నెస్, ఇంటి చిట్కాలు, ఫ్యాషన్, హోమ్ డెకార్, రిలేషన్షిప్ వార్తలతో పాటు వివిధ ఆరోగ్య అంశాలపై ఆరోగ్య నిపుణులు, న్యూట్రిషనిస్ట్, డైటీషియన్లు, ఆయుర్వేద నిపుణులు ఇచ్చిన సలహాలు, సమాచారం ఆధారంగా విస్తృత స్థాయిలో వార్తల్ని రాశారు. అంతేకాకుండా క్లీవ్ ల్యాండ్ క్లినిక్, మాయో క్లినిక్, WHO, హార్వర్డ్ వంటి పరిశోధనలు ఆధారంగా కూడా కంటెంట్ అందించారు. ఈ సమాచారాన్ని నిజమో కాదో తెలుసుకోవడానికి నిపుణుల సలహా తీసుకోమని కూడా వివరించారు. ఈ ఆర్టికల్స్ పాఠకులకు అర్థమయ్యేలా సరళమైన భాషలో రాస్తారు.కిషోర్ రెడ్డి 2015లో సాక్షి జర్నలిజం స్కూల్లో జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం సాక్షి న్యూస్ ఛానెల్లో (20.08.2016 నుంచి 23.03.2020 వరకు) సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్, విద్య, ఉద్యోగం వార్తలు రాశారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ / జాబ్స్ సెక్షన్ చూసుకునేవారు. ఆ తర్వాత 02.04.2020 నుంచి సమయం తెలుగులో విద్య, ఉద్యోగ వార్తలతో పాటు టెక్నాలజీ న్యూస్, అడ్వర్టయిజ్‌మెంట్స్ కూడా రాశారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, ప్రముఖల ఇంటర్వ్యూలు చూడటం, కొత్త కొత్త అంశాల గురించి తెలుసుకోవడానికి ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి