
ఏపీలో గత ఎన్నికల తర్వాత రాజకీయాలకు బ్రేక్ ఇచ్చేసిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijayasai Reddy).. అడపాదడపా తన ట్వీట్లతో రచ్చ చేస్తూనే ఉన్నారు.
ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు విధానపరమైన నిర్ణయాల విషయంలో ఉచిత సూచనలు, సలహాలు ఇస్తుండటం ఆయనకు అలవాటే. వాటిని ప్రభుత్వాలు పట్టించుకుంటాయో లేదో తెలియదు కానీ సాయిరెడ్డి ట్వీట్ల హవా మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇదే క్రమంలో తాజాగా విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.పిల్లల్ని కనేయా చేయడమెలా? చంద్రబాబుకు సాయిరెడ్డి సలహా..!సాయిరెడ్డి తన తాజా ట్వీట్లో ఎన్నారైల గురించి ఓ కీలక ప్రతిపాదన చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు తమ స్వగ్రామాలకు ఏదో చేయాలనే ఆరాటంలో ఉన్నారని, కానీ ఇక్కడి ప్రభుత్వాల జోక్యం వల్ల అది సాధ్యం కావడం లేదని, కాబట్టి కేంద్రం జోక్యం చేసుకుని, సాధ్యమైన తక్కువగా ప్రభుత్వాల జోక్యం ఉండేలా చూడాలని సాయిరెడ్డి అభ్యర్ధించారు. ఈ మేరకు విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ ను ఉద్దేశించి సాయిరెడ్డి ఈ ట్వీట్ చేశారు. సీబీఐకి సాయికృష్ణ లాకప్ డెత్ కేసు? హైకోర్టు కీలక నిర్ణయం..!తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది ఎన్నారైలు రోడ్లు, గ్రంథాలయాలు, తాగునీటి సౌకర్యాలు మొదలైన వాటికి నిధులు సమకూర్చడం ద్వారా తమ సొంత గ్రామాలకు తిరిగి సేవ చేయడానికి సుముఖంగా ఉన్నారని సాయిరెడ్డి తెలిపారు. అందుకు ఉద్దేశం, వనరులు ఉన్నప్పటికీ, అటువంటి సహకారాలను అందించడానికి పారదర్శకమైన మార్గం లేదన్నారు. ప్రభుత్వ జోక్యం కనిష్టంగా ఉండేలా, ఎన్నారైల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధికి వీలు కల్పించే ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని జైశంకర్ ను ఆయన కోరారు.