
ఇండియా ప్రస్తుతం డిజిటల్ మయం అయిపోయింది... ప్రతి పనీ టెక్నాలజీ సాయంతో జరుగిపోతోంది. ఇక ఆర్థిక లావాదేవీల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు...
గతంలో మాదిరిగా బ్యాంకులు చుట్టూ తిరిగే అవసరం లేకుండా చేతిలోనే స్మార్ట్ ఫోనే డిజిటల్ బ్యాంకుగా మారింది. యూపిఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) యాప్స్ ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, భీమ్, అమెజాన్ పే ద్వారా ఒక్క క్లిక్ తోనే ఆర్థిక లావాదేవీలు జరిగిపోతున్నాయి.
అయితే ఈ యూపిఐ యాప్స్ ద్వారా పేమెంట్స్ చాలా జాగ్రత్తగా చేయాలి... ఏ చిన్న పొరపాటు చేసినా డబ్బులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. తప్పుడు ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే తెలియని వ్యక్తుల అకౌంట్లోకి డబ్బులు వెళతాయి... కొన్నిసార్లు పొరపాటున ఎక్కువ డబ్బులు పంపిస్తుంటాం. ఇలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక చాలామంది కంగారుపడిపోతుంటారు. మరి ఈ సమయంలో ఏం చేయాలి?పంపిన డబ్బును తిరిగి పొందగలమా? అనే విషయాలు వివరంగా చూద్దాం.
సాధారణంగా ఈ కింద కారణాల వల్ల యూపిఐలో తప్పుడు ట్రాన్సాక్షన్లు జరుగుతాయి.
ముందుగా ట్రాన్సాక్షన్ ఐడీ, యూటీఆర్ నంబర్, తేదీ, సమయం, అమౌంట్ వంటి వివరాలను స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోండి.
2. డబ్బు అందుకున్న వ్యక్తిని కాంటాక్ట్ చేయండి
పొరపాటున డబ్బు వెళ్లిన వ్యక్తి వివరాలు మీకు తెలిస్తే, నేరుగా వాళ్లను సంప్రదించి డబ్బు తిరిగి పంపమని అడగవచ్చు. చాలా సందర్భాల్లో ఇదే ఫాస్ట్ సొల్యూషన్.
3. బ్యాంకు లేదా యూపీఐ యాప్‌లో ఫిర్యాదు చేయండి
Google Pay, PhonePe, Paytm, BHIM వంటి యాప్స్‌లో 'Transaction History'కి వెళ్లి, సంబంధిత ట్రాన్సాక్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి. అక్కడ 'Report Issue' లేదా 'Raise Complaint' ఆప్షన్‌ను ఎంచుకుని, తప్పుడు లావాదేవీ గురించి వివరాలు నమోదు చేయండి.
మీరు తప్పుడు వ్యక్తులకు డబ్బులు పంపినా, పంపాల్సిన దానికంటే ఎక్కువ డబ్బులు పంపినా ఏం చేయాలి? యూపీఐ లావాదేవీలను పర్యవేక్షించే సంస్థ NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) రూల్స్ ఏం చెబుతున్నాయి?
ముందుగా బ్యాంకులో అధికారికంగా ఫిర్యాదు చేయవచ్చు.
NPCI గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా కంప్లైంట్ రిజిస్టర్ చేయవచ్చు. NPCI డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజం ద్వారా 1800-120-1740 టోల్-ఫ్రీ నంబర్‌కు కూడా ఫిర్యాదు చేయొచ్చు.
విచారణ తర్వాత డబ్బు పొరపాటున వెళ్లిందని తేలితే, దాన్ని రికవర్ చేసే ప్రాసెస్ మొదలవుతుంది.
NPCI నిబంధనల ప్రకారం నెలలో 10 సార్లు మాత్రమే తప్పుగా పంపిన డబ్బును తిరిగి పొందడానికి ప్రయత్నించవచ్చు. అదే ఒకే వ్యక్తికి 5 కంటే ఎక్కువసార్లు తప్పుగా పంపితే డబ్బు తిరిగి రాదు.
బ్యాంకు లేదా యూపీఐ సర్వీస్ ప్రొవైడర్‌కు ఫిర్యాదు చేసినా పరిష్కారం దొరకకపోతే RBI ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ కింద ఫిర్యాదు చేయవచ్చు. దీనికోసం ముందుగా బ్యాంకులో ఫిర్యాదు చేసి ఉండాలి. 30 రోజుల్లోగా పరిష్కారం రాకపోతేనే RBIని సంప్రదించాలి.
ఫిర్యాదు, విచారణను బట్టి కొన్ని రోజుల్లో పరిష్కారం దొరకొచ్చు. కొన్ని క్లిష్టమైన కేసుల్లో కొన్ని వారాలు పట్టొచ్చు. ట్రాన్సాక్షన్ వివరాలు కరెక్ట్‌గా ఇస్తే, ప్రాసెస్ వేగంగా జరుగుతుంది.
కొన్ని సందర్భాల్లో యూపిఐ ద్వారా జరిగిన పొరపాటును సరిదిద్దుకోలేం… అంటే డబ్బు తిరిగి రావడం కష్టం అన్నమాట. ఇలాంటి సందర్భాలేంటంటే…
యూపిఐ పేమెంట్స్ సమయంలో తప్పులు జరగకుండా ఉండాలంటే?