
ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి దూసుకెళ్లగా, టెస్ట్ బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా...
ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి దూసుకెళ్లగా, టెస్ట్ బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానాన్ని న్యూజిలాండ్ పేసర్ మాట్ హెన్రీతో పంచుకున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్ తిరిగి టెస్టుల్లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు.గిల్ దూకుడు.. మెరిసిన ఇషాన్ఆఫ్ఘనిస్థాన్తో వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన శుభ్‌మన్ గిల్, మూడు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంకును కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్‌కు, గిల్‌కు మధ్య కేవలం 24 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. ఇదే సిరీస్‌లో రాణించిన మరో భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ ఏకంగా 21 స్థానాలు మెరుగుపరుచుకుని 43వ ర్యాంకుకు చేరుకున్నాడు.భారత బౌలర్లు కూడా ఈ సిరీస్‌లో మెరుగైన ప్రదర్శనతో ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు. ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 16 స్థానాలు ఎగబాకి 22వ ర్యాంకులో నిలిచాడు. యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ 34 స్థానాలు మెరుగుపరుచుకుని 58వ స్థానానికి చేరుకోగా, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ 17 స్థానాలు ఎగబాకి 71వ ర్యాంకును దక్కించుకున్నాడు.టెస్టుల్లో బుమ్రాకు పోటీ.. హెన్రీ చరిత్రటెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 11 వికెట్ల ప్రదర్శనతో మ్యాచ్ విన్నర్‌గా నిలిచిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ, భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు.