
పశ్చిమ బెంగాల్లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న వేర్‌హౌస్ కుప్పకూలిన ఘటనలో డజన్ల కొద్దీ వర్కర్లు శిథిలాల కింద చిక్కుకుపోయారు.
కోల్‌కతా, జూన్ 24: పశ్చిమ బెంగాల్లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న వేర్‌హౌస్ కుప్పకూలిన ఘటనలో డజన్ల కొద్దీ వర్కర్లు శిథిలాల కింద చిక్కుకుపోయారు. కోల్‌కతాలోని తరతలలో బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు చెబుతున్న వివరాల మేరకు.. తరతలలో వేర్‌హౌస్ నిర్మాణం జరుగుతోంది. దాదాపు 50 మందిదాకా వర్కర్లు బుధవారం వేర్‌హౌస్‌లో పని చేస్తున్నారు. మధ్యాహ్నం ఉన్నట్టుండి వేర్‌హౌస్ కుప్పకూలిపోయింది. వర్కర్లు అందరూ శిథిలాల కింద చిక్కుకుపోయారు.
ఇది గమనించిన స్థానిక జనం హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలెట్టారు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ సిబ్బంది, సైనికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 7 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. గ్యాస్ కట్టర్ల సాయంతో వేర్‌హౌస్ బీమ్‌లను కట్ చేసి మిగిలిన వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఇంట విషాదం
ఒకప్పుడు KGF.. ఇప్పుడు JGF: సీఎం చంద్రబాబు