
Festivals List Of July Month: జూన్ మాసం ముగియగానే తర్వాతి నెల అయిన జూలై ప్రారంభమవుతుంది. అయితే 2026 జూలైలో ఆషాడమాసం మొదలవ్వబోతోంది. ఈ నెలలో కొన్ని పండుగలు, ప్రత్యేక దినాలు ఉన్నాయి.
ప్రత్యేకంగా ఈ నెలలో తొలిఏకాదశి, గురుపౌర్ణమి కూడా రానుంది. 2026 జూలైలో వచ్చే ఆ ప్రత్యేక పండుగల జాబితా ఏమిటో ఇప్పుడు చూద్దాం.
జూలై నెల చాలా విశిష్టమైనది. ప్రతి ఏటా ఏడో నెలలో వచ్చే ఈ జూలైలో ప్రత్యేకత ఏంటంటే, ప్రతిసారి ఆషాడ మాసం ఈ నెలలోనే మొదలవుతుంది. ఈ మాసంలో ఆషాడ మాసం సందర్భంగా బోనాలు ఎంతో వైభవంగా జరుగుతాయి, ముఖ్యంగా తెలంగాణలో ఈ బోనాల వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.
జూలై నెలలో మొదటి రోజు కుసుమ మహారాజ జయంతి, ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు జయంతి వంటివి వస్తున్నాయి. అయితే ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, జూలై 14న వటసావిత్రి వ్రతం, జేష్ట అమావాస్య కూడా ఉంది. అలాగే గురుమౌడ్యమి కూడా ఈ రోజే ప్రారంభమవుతుంది.
జూలై 2026, 15వ తేదీన ఆషాడమాసం ప్రారంభమవుతుంది. ఆ రోజే వారాహి నవరాత్రులు కూడా మొదలవుతాయి. ఆషాడ మాసంలోనే బోనాల పండుగ వేడుకలు జరుగుతాయి. మరుసటి రోజు అంటే జూలై 16న పూరి జగన్నాధ రథోత్సవం నిర్వహించనున్నారు, మన దేశంలోనే ఇది అతి పెద్ద రథోత్సవం.
జూలై 17వ తేదీన దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఇక జూలై 19వ తేదీ నుంచి వరుసగా ఆదివారాలు తెలంగాణలో బోనాలు నిర్వహిస్తారు. మొదటగా గోల్కొండ బోనాలతో వేడుకలు మొదలై, ఆ మరుసటి వారం బల్కంపేట, ఆ తర్వాత లష్కర్ బోనాలు, ఓల్డ్ సిటీ బోనాలు, చివరగా రంగంలో బోనాలు ఆషాడ మాసం అంతా జరుగుతాయి.
జూలై 25 తేదీల్లో చాతుర్మాసం కూడా ప్రారంభమవుతుంది. అలాగే అదే రోజు వాసుదేవ ద్వాదశి కూడా వస్తుంది. ఈ పండుగలలో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, జూలై 25న తొలి ఏకాదశి కూడా ఉంది. ఇది ఎంతో విశేషమైన ఏకాదశి వేడుక, ఆ రోజు ఉపవాసాలు నిర్వహిస్తారు.
కోరికలు నెరవేరాలని విష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తూ, తొలి ఏకాదశి రోజున ఉపవాసాలు ఇస్తారు. ఇక జూలై 29వ తేదీన గురు పౌర్ణమి కూడా రానుంది, ఇది గురువులకు ఎంతో ప్రత్యేకమైనది. జూలై 29న ఆషాడ పూర్ణిమ, ఉపవాసాలు కూడా ఉంటాయి.
(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)