
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Gold- Silver Price Drop: బంగారం, వెండి ధరలు తమ ఆకర్షణను కోల్పోతున్నాయి. పెరుగుట విరుగటకే అన్నట్లుగా ఈ ఏడాది జనవరిలో 1.90లక్షలకు చేరుకున్న బంగారం ధర అదే స్థాయిలో తగ్గుతూ వస్తుంది. వెండి ధరలు కూడా భారీగా పతనం అయ్యాయి. ఈ నాలుగు నెలల కాలంలోనే దాదాపు 2 లక్షల మేర పతనం అయ్యింది. ప్రస్తుతం ఇరాన్ యుద్ధం ముగిసిపోవడం, ముడి చమురు ధరలు తగ్గడం వల్ల జూన్ లో ఈ విలువైన లోహాల ధరలు వరుసగా16000 వేలు బంగారం, 33,000 వెండి తగ్గింది. అయితే ఈ తగ్గుదల ఇక్కడితో ఆగదని నిపుణులు అంటున్నారు.
రాబోయే మూడు రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత భారీగా తగ్గే అవకాశం ఉంది. బంగారం ధర రూ.1,00,000 కంటే దిగువకు పడిపోవచ్చని.. వెండి ధర రూ.1.90 లక్షలకు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈ పతనానికి నిపుణులు 4 ప్రధాన కారణాలను పేర్కొంటున్నారు. ఈ భారీ తగ్గుదల గురించి, దేశంలోని ప్రముఖ కమోడిటీ నిపుణులు అనుజ్ గుప్తా, అజయ్ కేడియా ఏమంటున్నారో తెలుసుకుందాం.
1. వడ్డీ రేట్ల పెంపునకు ఫెడ్ సన్నాహాలు: బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, బ్రోకరేజ్ విభాగమైన బోఫా సెక్యూరిటీస్ అంచనా ప్రకారం, ఫెడరల్ రిజర్వ్ ఈ త్రైమాసికంలో సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ నెలల్లో మూడుసార్లు వడ్డీ రేట్లను పెంచుతుంది. దీనితో ప్రామాణిక రేటు ప్రస్తుత 3.5శాతం–3.75శాతం శ్రేణి నుండి 4.25శాతం–4.5శాతంకి చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇది బంగారం ధరలపై ఒత్తిడిని పెంచి, ధరలు మరింత తగ్గేందుకు కారణం అవుతాయని చెబుతున్నారు.
2. ఏడాది గరిష్ఠానికి చేరిన డాలర్ సూచీ: ప్రధాన ప్రపంచ కరెన్సీలతో పోలిస్తే డాలర్ సూచీ ఏడాది గరిష్ఠ స్థాయికి చేరింది. సాధారణంగా డాలర్ బలపడటం బంగారం ధరలపై ఒత్తిడిని పెంచుతుంది. దీనివల్ల బంగారం ధరలు కూడా తగ్గుతాయి.
3. గోల్డ్ ఈటీఎఫ్‌లో భారీ అమ్మకాలు: బంగారంపై ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసం సన్నగిల్లడంతో, గోల్డ్ ఈటీఎఫ్‌లో సుమారు 2 బిలియన్ డాలర్ల మేర భారీ అమ్మకాలు జరిగాయి.
4. ఇరాన్ యుద్ధం ముగింపు: ఇరాన్, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు సడలడంతో, సురక్షిత పెట్టుబడిగా బంగారానికి ఉన్న డిమాండ్ పూర్తిగా తొలగిపోయింది. ఇన్వెస్టర్లు ఇప్పుడు బంగారం నుండి డబ్బును ఉపసంహరించుకుని, దానిని ఇతర ఆస్తులలో పెట్టుబడి పెడుతున్నారు. ఇది బంగారం ధరలను మరింతగా తగ్గిస్తుంది.
అయితే ప్రస్తుతం.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ప్రస్తుతం ఔన్సుకు దాదాపు 4,000డాలర్లకు చేరుకున్నాయి. సెప్టెంబర్ నాటికి ధరలు మరింత గణనీయంగా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. బంగారంపై భారత ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచడం దేశీయ మార్కెట్లో డిమాండ్‌పై గణనీయంగా ప్రభావం చూపింది. ముడి చమురు ధరల తగ్గుదల కూడా బంగారం ధరలను తగ్గిస్తోంది. ఈ కీలక కారకాలన్నీ బంగారం ధరను తగ్గిస్తాయని అనూజ్ గుప్తా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అజయ్ కేడియా ప్రకారం.. కేడియా కమోడిటీ కామ్‌ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు.. డైరెక్టర్ అయిన అజయ్ కేడియా ప్రకారం.. రాబోయే రోజుల్లో ప్రపంచ మార్కెట్లో వెండి ధర 53 డాలర్లకు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. భారత మార్కెట్లో వెండి ధర రూ.1.90 లక్షలకు పడిపోయే ఛాన్స్ ఉందంటున్నారు. మరోవైపు, వెండి అమ్మకాలలో భయాందోళనలు చెలరేగితే, ధర మరింత కుప్పకూలే ఛాన్స్ ఉందంటున్నారు.
ప్రస్తుత బేరిష్ ఒత్తిడి ఉన్నప్పటికీ, బంగారం, వెండి మార్కెట్లకు దిగువ నుండి మద్దతు ఇవ్వడానికి కొన్ని ప్రధాన కారకాలు ఇప్పటికీ చురుకుగా ఉన్నాయని అజయ్ కేడియా అభిప్రాయపడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు ఇప్పటికీ నిరంతరం బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఇది ధరలకు మద్దతు ఇస్తోంది.
బ్యాంక్ ఆఫ్ జపాన్ విధానాల కారణంగా ఈ సమయంలో బంగారానికి కూడా మంచి మద్దతు లభిస్తోంది.
డాలర్ బలంగా కనిపించినప్పటికీ, దీర్ఘకాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ అంత బలమైన స్థితిలో లేదు, ఇది బంగారం పూర్తిగా పతనమవకుండా నిరోధిస్తుంది.
రికార్డు స్థాయి నుండి ఇప్పటి వరకు భారీ పతనం: బంగారం, వెండి తమ రికార్డు స్థాయిల నుండి గణనీయంగా పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా, జనవరి 28, 2026న బంగారం ఔన్సుకు $5,589.38 వద్ద సర్వకాలిక గరిష్ట స్థాయికి చేరుకోగా, వెండి ఔన్సుకు $117 వద్ద రికార్డు గరిష్ట స్థాయికి చేరింది. భారతదేశంలో జనవరి 29, 2026న MCXలో 10 గ్రాముల బంగారం రూ. 1,93,096 వద్ద.. కిలో వెండి రూ. 4,20,048 వద్ద సర్వకాలిక గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అయితే.. జూన్ 24, 2026న, 10 గ్రాముల బంగారం సుమారు రూ. 1,44,000 వద్ద.. కిలో వెండి రూ. 2,23,000 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అంటే బంగారం తమ రికార్డు స్థాయిల నుండి సుమారు రూ. 50,000 వెండి సుమారు రూ. 2 లక్షలు పడిపోయింది.
ఇన్వెస్టర్లకు నిపుణుల సలహా: ప్రస్తుతం కొనసాగుతున్న మార్కెట్ అస్థిరత నేపథ్యంలో.. సాధారణ పెట్టుబడిదారులు.. కొనుగోలుదారులు ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టవద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు. బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టడానికి ఇదే ఉత్తమ సమయం అయినప్పటికీ.. మీరు సిప్ పద్దతిని ఎంచుకోవాలని అజయ్ కేడియా అంటున్నారు. ధర తగ్గిన ప్రతిసారీ చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా.. సెప్టెంబర్ నాటికి మంచి సగటు ధరను సాధించవచ్చని హామీ ఇస్తున్నారు.
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.