
Jonnagiri Gold Mines News: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, మైనింగ్ రంగాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. కరువు నేలగా పేరుగాంచిన రాయలసీమ ప్రాంతం ఇకపై బంగార పంటతో ఆంధ్ర కేజిఎఫ్ గా వెలువందనం ఉంది.
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి అతి పెద్ద ప్రైవేట్ రంగా గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అధికారికంగా ప్రారంభించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లో భాగంగా ఈ మైనింగ్ ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే కీలక మైలురాయిగా నిలవనుంది.