
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Gade Sai Krishna Case: పోలీస్ కస్టడీలో సాయికృష్ణ అనే యువకుడి మృతి చెందిన కేసులో ప్రత్యేక విచారణ బృందం (SIT) దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. సాయికృష్ణ మరణానికి, సాక్ష్యాధారాల ధ్వంసానికి అప్పటి కృష్ణలంక సీఐ నాగరాజే ప్రధాన కారణమని సిట్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు రిమాండ్ రిపోర్టు ద్వారా వెలుగులోకి వచ్చాయి.
కస్టడీలోనే మరణం.. ఎస్సై వాగ్మూలం సిట్ విచారణలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఎస్సై ఇచ్చిన వాగ్మూలం కీలక మలుపుగా మారింది. మే 6, 2026 నుండి మే 8, 2026 మధ్య కాలంలో సాయికృష్ణను తాను కృష్ణలంక పీఎస్ లో చూశానని, అతను మరణించిన తర్వాత మృతదేహాన్ని కూడా అక్కడే గమనించానని ఎస్సై సిట్‌కు ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. జూన్ 2, 2026 కంటే ముందే సాయికృష్ణ మరణించి ఉంటాడని, కస్టడీలో ఉండగా జరిగిన తీవ్రగాయాల వల్లే అతను ప్రాణాలు కోల్పోయాడని అన్ని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.
సాయికృష్ణ మరణించిన విషయం స్పష్టంగా తెలిసినప్పటికీ, కృష్ణలంక పోలీస్ సిబ్బంది ఆ సమాచారాన్ని మేజిస్ట్రేట్‌కు చేరవేయకుండా దాచిపెట్టారు. కొడుకు కనిపించడం లేదంటూ సాయికృష్ణ తల్లి స్టేషన్‌కు వెళ్లగా, సీఐ నాగరాజు ఆమెను తీవ్రంగా దూషించారు. ఆ తర్వాత బాధితురాలి తరఫున హైకోర్టులో 'హెబియస్ కార్పస్' పిటిషన్ దాఖలైనప్పటికీ, పోలీసులు కోర్టు ముందు కూడా వాస్తవాలను వెల్లడించకుండా, తీవ్రంగా తప్పుదోవ పట్టించారని సిట్ పేర్కొంది.
సీసీటీవీ ఫుటేజ్, ఆధారాల ధ్వంసం సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సైంటిఫిక్ ఆధారాలను పూర్తిగా తుడిచిపెట్టేందుకు సీఐ నాగరాజు పథకం రచించారు. మే 1, 2026 నుండి జూన్ 1, 2026 వరకు ఉన్న కీలకమైన నెల రోజుల సీసీటీవీ ఫుటేజ్ డేటాను డీవీఆర్ (DVR) లలో లేకుండా మాయం చేశారు. సాక్ష్యాలను నాశనం చేయడం ద్వారానే సాయికృష్ణను హత్య చేశారనే కోణాన్ని సిట్ నిర్ధారించింది. ప్రస్తుతం ఈ ధ్వంసమైన డీవీఆర్‌లను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఈ దారుణ ఉదంతం వెనుక ఉన్న మరిన్ని అసలు నిజాలను, పూర్తి కుట్రను వెలికితీయాలంటే నిందితుడైన సీఐ నాగరాజును కస్టడీలోకి తీసుకుని సమగ్రంగా విచారించాల్సి ఉందని సిట్ తన రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.