
ఏపీలో విజయవాడ పోలీసుల చేతిలో లాకప్ డెత్ కు గురైనట్లు భావిస్తున్న గాదె సాయికృష్ణ (Sai Krishna Case) కేసు ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
నగరంలోని కృష్ణలంక పోలీసులు మార్కాపురం నుంచి తీసుకొచ్చిన సాయికృష్ణను కస్టడీలో హింసించి చంపేశారని, శవాన్ని సైతం కుటుంబానికి ఇవ్వకుండా దహనం చేసేశారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు (High Court).. ఈ నెల 29న అతన్ని హాజరుపర్చాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆలోపే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.సువేందుకు మమత తొలి షాక్..! కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు..!సాయికృష్ణను కస్టడీలో చంపేశారని అతని తల్లి చేస్తున్న ఆరోపణల ఆధారంగా ప్రభుత్వం ఇందుకు బాధ్యుడిగా భావిస్తున్న కృష్ణలంక సీఐ నాగరాజును తొలుత సస్పెండ్ చేసి, ఆ తర్వాత అరెస్టు కూడా చేసి ఇవాళ కోర్టులో హాజరుపర్చింది. అతనికి రిమాండ్ కూడా విధించారు. మరోవైపు సాయికృష్ణ అదృశ్యంపై రాష్ట్ర పోలీసుల దర్యాప్తు వల్ల న్యాయం జరగదని, సీబీఐకి ఈ కేసు అప్పగించాలని హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. దీనిపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు.. కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి మెడకు సాయికృష్ణ లాకప్ డెత్..! హైకోర్టు డెడ్ లైన్-ఏం చెప్పబోతున్నారు ?సాయికృష్ణ లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగించాలని దాఖలైన పిల్ పై విచారణ జరిపిన హైకోర్టు ..ప్రభుత్వం తరఫున తీసుకున్న చర్యల్ని ప్రశ్నించింది. దీంతో సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రభుత్వ తెలిపింది. అలాగే ఈ కేసులో నిందితుడిగా ఉన్న నాగరాజును అరెస్టు కూడా చేసినట్లు వెల్లడించింది. ఇవాళ నాగరాజును కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపింది. దీంతో హైకోర్టు.. సీబీఐకి ఈ కేసును అప్పగించే విషయంలో నిర్ణయాన్ని వాయిదా వేసింది. ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూద్దామని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేశారు.