
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కృష్ణా జిల్లాలో పర్యటించారు. మోపిదేవి మండలం కొక్కిలగడ్డ గ్రామంలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వరస్వామి వారిని బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు...
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కృష్ణా జిల్లాలో పర్యటించారు. మోపిదేవి మండలం కొక్కిలగడ్డ గ్రామంలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వరస్వామి వారిని బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు.అనంతరం ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేశ్‌కు పండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. గర్భగుడిలో స్వామివారిని దర్శించుకుని లోకేశ్ ప్రత్యేక అర్చనలు జరిపించారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి, ఆశీర్వచనాలు పలికారు.ఈ కార్యక్రమంలో మంత్రి వెంట మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, తెనాలి శ్రావణ్ కుమార్, గళ్లా మాధవి, భాష్యం ప్రవీణ్, వెనిగండ్ల రాము, కాగిత కృష్ణ ప్రసాద్, బోడె ప్రసాద్‌తో పాటు పలువురు టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.