Stock Split : స్మాల్ క్యాప్ కేటగిరిలోని స్టీల్ అండ్ ఐరన్ సెక్టార్ కంపెనీ మంగళం వరల్డ్ వైడ్ లిమిటెడ్ ( Mangalam World wide Limited ) బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఇటీవలే తమ వాటాదారులకి శుభవార్త చెప్పారు.
తమ కంపెనీలో 10:1 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేపట్టాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలుపడం జరిగింది. అయితే తాజాగా ఈ స్టాక్ స్ప్లిట్ కి సంబంధించిన రికార్డు డేట్ ని జూలై 10గా నిర్ణయించినట్లు కంపెనీ తమ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా తెలిపింది.మరోవైపు ఈ కంపెనీ షేరు గత ఏడాదిలో తమ షేర్ హోల్డర్లకు ఏకంగా 127 శాతం లాభాన్ని అందించింది. మల్టీబ్యాగర్ స్టాక్స్ లో ఒకటిగా నిలిచింది. స్టాక్ స్ప్లిట్ తర్వాత ప్రస్తుతం రూ. 371 వద్ద ఉన్న షేర్ ధర రూ. 37 ల స్థాయికి తగ్గనుంది. అలాగే షేర్ల సంఖ్య పది రెట్లు పెరగనుంది. 100 షేర్లు కొన్నవారికి ఏకంగా 1000 షేర్లు లభిస్తాయి. కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. కంపెనీస్ యాక్ట్ 2013లోని సెక్షన్ 61 ప్రకారం మంగళం వరల్డ్ వైడ్ లిమిటెడ్ బోర్డు డైరెక్టర్స్ ఇటీవలే సమావేశమై 10:1 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేయాలని ఆమోదం తెలిపారు. దీని అర్థం రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న 1 షేరుని రూ. 1 ఫేస్ వ్యాల్యూ ఉండేలా 10 ఈక్విటీ షేర్స్ గా విభజిస్తారు. ఈ స్టాక్ స్ప్లిట్ సంబంధించిన రికార్డు డేట్ జులై 10, 2026గా బోర్డు డైరెక్టర్స్ నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. ఈ స్టాక్ స్ప్లిట్ ప్రకారం 10 షేర్లు కొనుగోలు చేసినట్లయితే 100 షేర్లొస్తాయి. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. గత వారం రోజుల్లో ఈ షేరు 1 శాతం నష్టాన్ని మిగిల్చింది. గత నెల రోజుల్లో 1 శాతం లాభాన్ని అందించింది. గత ఆరు నెలల్లో 39 శాతం పెరిగింది. గత ఏడాది కాలంలో 127 శాతం లాభాన్ని అందించింది. ఏడాది క్రితం లక్ష రూపాయలు పెట్టి ఇందులో షేర్లు కొనుగోలు చేసినట్లయితే ఇప్పుడు ఆ విలువ రూ. 2.27 లక్షలు అవుతుంది. అంటే ఏడాదిలోనే పెట్టుబడి రెండింతలకు పైగా పెరిగింది. గత ఐదు సంవత్సరాలలో 236 శాతం లాభాన్ని అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 1100 కోట్లుగా ఉంది. అయితే ఈ కథనం సమాచారం కోసమే. మార్కెట్లో హైరిస్క్ ఉంటుంది. స్టాక్ స్ప్లిట్ ద్వారా షేర్ల సంఖ్య పెరుగుతుంది, ధర తగ్గుంది. అయితే పెట్టుబడిలో ఎలాంటి మార్పు ఉండదు.