వెల్లుల్లిని దంచి నీళ్లలో వేసి బ్లెండ్ చేయండి. దీని నుంచి రసం తీసి మిడతలు తిరిగే చోట చల్లండి. దీని నుంచి వచ్చే ఘాటు వాసనకు మిడతలు పారిపోతాయి.
వేప నూనెలోని యాంటీ మైక్రోబియల్ గుణాలు, దాని నుంచి వచ్చే వాసనకు మిడతకు పారిపోతాయి. దీనికోసం నీళ్లలో వేప నూనె కలిపి స్ప్రే బాటిల్లో తీసుకోండి. మిడతలు తిరిగే చోట ఇది స్ప్రే చేస్తే సరిపోతుంది.
నీళ్లలో కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా డిష్ వాష్ లిక్విడ్ కలిపి బాటిల్లో తీసుకోండి. దీనిని మిడతలు తిరిగే ప్రదేశంలో స్ప్రే చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
మిడతలు ఎక్కువగా ఆకులు తింటాయి. అందుకే మీ ఇంట్లో మొక్కలు, లేదా గడ్డి ఉంటే ఆ ప్రాంతంలో సూర్యోదయానికి ముందే ఏదైనా పిండి చల్లండి. మిడతలు ఆకులు తినేందుకు వచ్చి పిండి తినడం వల్ల వాటి నోరు అతుక్కుపోతుంది. దీంతో అవి చనిపోతాయి.
కొన్ని ఘాటు వాసన వచ్చే మొక్కలు ఇంట్లో ఉంచడం వల్ల కూడా మిడతలు రాకుండా కాపాడుకోవచ్చు. తులసి, పుదీనా, కలెండ్యూలా, లావెండర్ వంటి మొక్కలు ఇంట్లో ఉంచితే మిడతలు రావు.
లవంగాల నూనె నుంచి వచ్చే ఘాటు వాసనకు మిడతలు పారిపోతాయి. దీనికోసం నీటిలో కొద్దిగా లవంగాల నూనె కలిపి స్ప్రే బాటిల్లో తీసుకోండి. దీనిని మిడతలు ఉన్నచోట స్ప్రే చేస్తే మంచిది.
యూకలిప్టస్ ఆయిల్ నుంచి వచ్చే ఘాటు వాసనకు మిడతలు రాకుండా ఉంటాయి. దీనికోసం యూకలిప్టస్ ఆయిల్‌ను నీళ్లలో కలిపి చల్లితే సరిపోతుంది.
సాధారణంగా మీ ఇంటి బయట సాయంత్రం పూట వెలుతురు ఉంటే మిడతలు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే మిడతలు ఉంటే బయట లైట్స్ వేయకండి. లేదంటే మార్కెట్లో పురుగులను తరిమికొట్టే ఎల్లో లైట్స్ లభిస్తాయి. అవి వాడితే సరిపోతుంది.
ఇంట్లో గడ్డి, చెత్త లేకుండా చూసుకోండి. ఇంటి పరిసరాల్లో గడ్డి, మొక్కలు ఉంటే మిడతలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఇంటికి కనీసం 20 అడుగుల దూరంలో లేకుండా చూడండి. అలాగే ఇంటి గోడలకు బీటలు ఉంటే వాటిని పూరించడం మంచిది.