
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడిని మనస్సుకు, ప్రశాంతతకు, ఆనందానికి కారకుడిగా భావిస్తారు. అలాంటి శక్తివంతమైన చంద్రుడు జూన్ 24వ తేదీ అర్ధరాత్రి 12:52 గంటలకు తులారాశిలోకి ప్రవేశించాడు.
జూన్ 26వ తేదీ వరకు చంద్రుడు ఇదే రాశిలో సంచరించనున్నాడు. ఈ రెండు రోజుల పాటు చంద్రుడి ప్రత్యేక అనుగ్రహం కారణంగా కొన్ని రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోబోతున్నాయి. దీర్ఘకాలికంగా వేధిస్తున్న ఆర్థిక, మానసిక సమస్యలు తొలగిపోయి, ఊహించని ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆ అదృష్ట రాశులు ఎవరనేది తెలుసుకుందాం.వృశ్చిక రాశిచంద్రుడి పవర్‌ఫుల్ ప్రభావం వల్ల వృశ్చిక రాశి వారిలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. పట్టిన ప్రతి పనీ విజయవంతంగా పూర్తవుతుంది. ఉద్యోగ రంగంలో ఊహించని పురోగతి లేదా ప్రమోషన్ లభించే ఛాన్స్ ఉంది. కుటుంబంలో మీ ప్రాధాన్యత పెరిగి, అందరి మన్ననలు పొందుతారు.మీన రాశిమీన రాశి వారికి కూడా ఈ రెండు రోజులు విపరీతమైన లాభాలను తెచ్చిపెట్టబోతున్నాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లేదా ఇతర ఇబ్బందులతో బాధపడేవారికి ఈ సమయంలో మంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని లాభాలు చూస్తారు. కుటుంబంలో ఉన్న మనస్పర్థలు తొలగిపోయి, శాంతి నెలకొంటుంది.కర్కాటక రాశిచంద్రుడి తులారాశి సంచారం కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. గత కొంతకాలంగా పడుతున్న మానసిక ఒత్తిడి తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది.మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సమయం ఆసన్నమైంది. ఆర్థిక పరిస్థితులు ఊహించని విధంగా మెరుగుపడతాయి.తులారాశిచంద్రుడు మీ స్వరాశిలోనే సంచరిస్తుండటం వల్ల తులారాశి వారికి ఈ సమయం ఎంతో సువర్ణావకాశంగా మారబోతోంది. చాలా కాలంగా నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ చకచకా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది.