
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర రాజధాని ముంబయితోపాటు థానే, పాల్ఘర్లను భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తాయి. పలు ప్రాంతాలు, రహదారులు జలదిగ్బంధం కావడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.
థానే-పుణె మధ్య కీలక మార్గమైన మాల్షేజ్ ఘాట్‌లో చెట్లు, కొండ చరియలు విరిగిపడటంతో.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీ వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముంబయిలోని పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో అంధేరి ప్రాంతంలోని సబ్వే (అండర్‌పాస్) పూర్తిగా నీట మునిగింది. దీంతో ముందస్తు చర్యగా ఈ అండర్‌పాస్‌లో వాహనాల రాకపోకలను బీఎంసీ నిలిపివేసింది. మరోవైపు వాతావరణం అనుకూలంగా లేనందున విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. విమానాల సమయాలను సంబంధిత వెబ్సైట్లలో చెక్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు. ఇదీ చదవండి: పుణె కేసులో ట్విస్ట్: ముక్కోణపు ప్రేమకథలో అతడే ముసుగు హంతకుడు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.