
మెల్బోర్న్: ఆయన గొంతు విప్పితే మైక్ అక్కర్లేదు, స్పీకర్లు తట్టుకోలేవు.. గాల్లో ఎగిరే జెట్ విమానం మోత, చెవులు బద్దలుకొట్టే అంబులెన్స్ సైరన్ శబ్దం.. వీటన్నింటినీ మించిపోయింది ఒక వ్యక్తి గొంతుక.
Jun 24 2026 5:42 AM | Updated on Jun 24 2026 5:42 AM
మెల్బోర్న్: ఆయన గొంతు విప్పితే మైక్ అక్కర్లేదు, స్పీకర్లు తట్టుకోలేవు.. గాల్లో ఎగిరే జెట్ విమానం మోత, చెవులు బద్దలుకొట్టే అంబులెన్స్ సైరన్ శబ్దం.. వీటన్నింటినీ మించిపోయింది ఒక వ్యక్తి గొంతుక. ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాకు చెందిన 58 ఏళ్ల జోసెఫ్ మెక్‌గ్రెయిల్ బాటప్ను ప్రపంచంలోనే ‘అత్యంత గట్టిగా అరిచే వ్యక్తి’గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా గుర్తించింది. కేవలం ఒక్కటంటే ఒక్క ముక్క.. ‘నౌ’అంటూ ఆయన చేసిన సింహనాదం 122.4 డెసిబెల్స్‌గా నమోదైంది.
32 ఏళ్ల రికార్డ్ బద్దలు! ఇంతకుముందు ఈ రికార్డ్ ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన స్కూల్ టీచర్ అన్నాలిసా ఫ్లానగన్ పేరిట ఉండేది. ఆమె 1994లో ‘క్వైట్’(నిశ్శబ్దం) అని ఏకంగా 121.7 డెసిబెల్స్ శబ్దంతో అరిచి రికార్డు సృష్టించారు. ఇప్పుడు జోసెఫ్ ఆ రికార్డును తిరగరాశారు. అయితే, జోసెఫ్ చాలా హుందాగా స్పందిస్తూ.. ‘ఆమె రికార్డు ఆమెకు ఉంది. ఇప్పుడు ఆమె ప్రపంచంలోనే అత్యంత గట్టిగా అరిచే మహిళ, నేను అత్యంత గట్టిగా అరిచే పురుషుడిని’.. అని వ్యాఖ్యానించారు.
‘ఈ రికార్డు కోసం ప్రత్యేకంగా సాధన చేయడం అసాధ్యం. ఆ ఒక్క పదం అరవడానికి నేను 7 సార్లు ప్రయత్నించాల్సి వచ్చింది. ఆ తర్వాత రెండు రోజుల పాటు నా గొంతు పూర్తిగా పడిపోయింది. బొంగురుపోయి అల్లాడిపోయాను’.. అన్నారు జోసెఫ్ మెక్‌గ్రెయిల్ బాటప్. ఒక రేడియో స్టూడియోలో ఎకౌస్టిక్ ఇంజనీర్ సమక్షంలో మే 2న ఈ రికార్డు ప్రయత్నం జరగ్గా, గిన్నిస్ సంస్థ దీనిని తాజాగా ధ్రువీకరించింది.
మా ఇంటి బంగారం టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు (ఫొటోలు)
ఢిల్లీలో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)
గ్రాండ్‌గా బోనీ కపూర్ కూతురి పెళ్లి వేడుకలు ప్రారంభం (ఫొటోలు)
Perni Nani: తొక్కి పెట్టి నార తీస్తావా? ఆటలో అరటిపండు గాడివి..!
ఇద్దరి బాలీవుడ్ భామలతో ఇంగ్లండ్ క్రికెటర్ ప్రేమాయణం!
ఢిల్లీలో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం
CI నాగరాజు కాలర్ ఎగరేసుకొని...! సాయి కృష్ణ కేసులో కూటమి కుట్ర
డబ్బు కోసమే రైల్వే ఎంప్లాయ్ ట్రాప్..! వైరల్ అవుతున్న ఆడియో