
పహాడీషరీఫ్, న్యూస్‌టుడే: మత్తు ఇంజెక్షన్ తీసుకున్న ఓ వైద్యుడు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా బాలాపూర్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్ కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెంది
న మొహ్మద్ ఇమాయతుల్లా కుమారుడు ఖాసిం(27) పాతబస్తీలోని యాకుత్‌పురలో నివాసముంటున్నారు. చార్మినార్ వద్ద ఉన్న నిజామియా యునానీ కళాశాలలో చదివారు. రెండు నెలలుగా మల్లాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రాత్రి విధుల్లో పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి విశ్రాంతికని ఆసుపత్రిలోని తన గదిలోకెళ్లి గడియపెట్టుకున్నారు. తర్వాత వైద్యుడు ఎంతసేపటికీ బయటకు రావడం లేదని ఆసుపత్రి సిబ్బంది గుర్తించారు. తలుపులు కొట్టినా తీయకపోవడంతో విరగ్గొట్టారు. అప్పటికే ఆయన మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే తనకు నిద్ర పట్టడం లేదని ఖాసిం చెప్పేవారని ఆయన తండ్రి పోలీసులకు తెలిపారు. నిద్ర కోసం మాత్రలతో పాటు మత్తు ఇంజెక్షన్ తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఖాసిం మృతి చెందిన విషయాన్ని ఆసుపత్రి యాజమాన్యం తమకు వెంటనే తెలియజేయలేదంటూ కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.