
"ఒక తండ్రిగా గర్వపడుతున్నాను. రంగస్థలం తర్వాత మళ్లీ అలాంటి సినిమా రావడానికి ఎన్నేళ్లు పడుతుందో అనుకున్నాను. కానీ ఇంత త్వరగా 'పెద్ది' రూపంలో వచ్చింది.
ఈ సినిమాలో చరణ్ కనిపించలేదు, 'పెద్ది' మాత్రమే కనిపించాడు. ఇది జాతీయ అవార్డు స్థాయి నటన" అంటూ మెగాస్టార్ చిరంజీవి తన తనయుడు రామ్ చరణ్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. 'పెద్ది' చిత్ర విజయోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, సినిమా చూస్తున్నంత సేపు ఒక తండ్రిగా, సీనియర్ నటుడిగా తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లు తెలిపారు. తన ప్రసంగంలో చరణ్ పడిన కష్టాన్ని, షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదాన్ని గుర్తుచేసుకుంటూ ఉద్వేగానికి గురయ్యారు.ఈ సినిమా కేవలం ఒక చిత్రంలా కాకుండా, గిరిజనుల జీవన విధానాన్ని, వారి ఆవేదనను, పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిందని చిరంజీవి అన్నారు. "సినిమా చూస్తున్నప్పుడు ఒక ట్రాన్స్‌లోకి వెళ్లిపోయాను. ఎన్నోచోట్ల పెద్ది పాత్రతో పాటు ప్రయాణించి, ఆ బాధను అనుభవించాను. ఇంత పవర్ఫుల్, ఎమోషనల్ సబ్జెక్ట్‌ను ఎంచుకుని, దానికి చరణ్ న్యాయం చేస్తాడని నమ్మిన దర్శకుడు బుచ్చిబాబును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది ఒక మట్టి కథ, మట్టి మనుషుల కథ. బుచ్చిబాబు లాంటి మట్టిలో మాణిక్యాలను వెలికితీసి, ఇండస్ట్రీకి బహుమతిగా ఇచ్చిన గురువు సుకుమార్‌కు నా అభినందనలు" అని చిరు పేర్కొన్నారు. బడ్జెట్ గురించి వెనకాడకుండా, దర్శకుడి విజన్‌ను నమ్మి ఇంత భారీ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత సతీష్ కిలారు ధైర్యాన్ని ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.ఈ సందర్భంగా, చరణ్ పడిన కష్టాన్ని వివరిస్తూ చిరంజీవి