
తల్లిదండ్రులకు , వాహనదారులకు హెచ్చరిక. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మైనర్లు వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి మైనర్లు డ్రైవ్ చేయడం బాధ్యతరాహిత్యానికి నిదర్శనంగా చూస్తున్న పోలీసులు మైనర్ పిల్లల తల్లిదండ్రులకు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు.వాహనం నడిపి ముగ్గురి చావుకు కారణం అయిన మైనర్ గత రెండు రోజుల క్రితం పర్వతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలుడు అతి వేగంగా వాహనం నడుపుతూ ఇద్దరు వృద్ధులు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో సంఘటనా స్థలంలోనే ఇద్దరు వృద్ధులు, ఒక మైనర్ మృతి చెందగా మరొక మైనర్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. మితిమీరిన వేగంతో మైనర్ వాహనం నడపటం వలనే ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.వాహన యజమానులు, తల్లిదండ్రులపై కఠిన చర్యలుదీంతో పోలీసులు మైనర్లకు వాహనాలు అందజేసి ప్రమాదాలకు కారణమైతే వాహన యజమానులు మరియు తల్లిదండ్రులు చట్టపరంగా బాధ్యులవుతారని హెచ్చరిస్తున్నారు. వారిపై కేసులు నమోదు చేసి జైలు పాలు చేస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. మైనర్లకు వాహనం ఇవ్వడం చట్టవ్యతిరేకమైన చర్య అని ఆయన వెల్లడించారు.యజమాని, తల్లిదండ్రులు జైలుకు వెళ్ళే పరిస్థితి ఇలాంటి బాధ్యతరాహిత్యం వల్ల జరిగే ప్రమాదాలకు వాహన యజమాని మరియు తల్లిదండ్రులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వరంగల్ సీపీ సూచించారు. మైనర్లను వాహనాలు నడపనివ్వకూడదన్నారు. బాధ్యతగా ప్రవర్తించి ప్రమాదాలను నివారించాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.తెలంగాణా పాత జ్ఞాపకాలతో జనసేనాని ఇంట్రెస్టింగ్ పోస్ట్... ఉద్దేశం ఇదేనా!మైనర్లకు వాహనాలివ్వకండి - అనవసరంగా జైలు పాలు కాకండిఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మైనర్ వాహనం నడపటం కారణంగానే జరిగిందని, అనవసరంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం అన్నారు . మైనర్లకు వాహనాలివ్వకండి - అనవసరంగా జైలు పాలు కాకండి అని సీపీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.