
కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజల నుంచి అర్జీలు స్వీకరించాల్సిన విద్యుత్ శాఖ ఏఈ ఉలిగప్ప తన మొబైల్లో సినిమా చూస్తూ కూర్చోవడం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇలాంటి అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ వార్త చదివారా: సిట్ అదుపులో సస్పెండైన కృష్ణలంక సీఐ నాగరాజు