
TG New Housing Scheme: తెలంగాణ ప్రజలకు సరికొత్త సృజనాత్మక సవాల్ విసిరింది ప్రభుత్వం. హైదరాబాద్ నగర పరిధిలో ‘క్యూర్’ (CURE) ప్రాజెక్టు కింద ఏకంగా లక్ష ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ హౌసింగ్(TG New Housing...
Telangana government given public an opportunity to win one lakh rupees by name Telangana new housing scheme
TG New Housing Scheme: తెలంగాణ ప్రజలకు సరికొత్త సృజనాత్మక సవాల్ విసిరింది ప్రభుత్వం. హైదరాబాద్ నగర పరిధిలో ‘క్యూర్’ (CURE) ప్రాజెక్టు కింద ఏకంగా లక్ష ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ హౌసింగ్(TG New Housing Scheme) బోర్డు భారీ ముందడుగు వేసింది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన, పేదల కలల సౌధమైన ఈ నూతన గృహ నిర్మాణ పథకానికి ఒక ఆకర్షణీయమైన, అర్ధవంతమైన పేరును సూచించే అద్భుతమైన అవకాశాన్ని ప్రజలకే కల్పించింది.
AP Cps Employees: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. ఫ్యామిలీ పెన్షన్ సమస్య పరిష్కారం..11 వేల మందికి లబ్ధి..
మీ ఆలోచనల నుంచి పుట్టే ఒక చక్కటి పేరు ఈ పథకానికి ఖరారైతే, మీకు ఏకంగా రూ.1,00,000 నగదు బహుమతి లభిస్తుంది. ఈ బృహత్తర పోటీలో పాల్గొనడం చాలా సులభం. మీరు అనుకున్న పేరును తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీ tghd.official ద్వారా ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. ఈ పోటీకి సంబంధించిన ఎంట్రీలను సమర్పించడానికి జూన్ 28 వరకు మాత్రమే గడువు విధించారు.
ఇది కేవలం బహుమతి గెలుచుకునే అవకాశం మాత్రమే కాదు, రేపు లక్షలాది కుటుంబాల ఇళ్లపై మీరిచ్చిన పేరే చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే సువర్ణావకాశం. మీ సృజనాత్మకతకు పదును పెట్టి, రాష్ట్ర స్థాయి పథకానికి నామకరణం చేసే ఈ లక్కీ ఛాన్స్‌ను అస్సలు మిస్ కావద్దు. ఆలస్యం చేయకుండా వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో మీ ఎంట్రీని పంపి విజేతగా నిలవండి!