
ఇంటర్నెట్ డెస్క్: ‘ఖానా ఖజానా’ టీవీషోతో రెస్టరంట్ స్టైల్ వంటకాలను గృహిణులకు పరిచయం చేశారు చెఫ్ సంజీవ్ కపూర్ (Sanjeev Kapoor).
నేటికీ ‘మాస్టర్ చెఫ్ ఇండియా రియాలిటీ షో’తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఎన్నో ఏళ్లు ఈ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన ఆయన తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఆఫర్ చేసినదానికన్నా రూపాయి పారితోషికం ఎక్కువ ఇవ్వనందుకు ఆ కార్యక్రమాన్ని రిజెక్ట్ చేసినట్లు తెలిపారు.
‘‘మాస్టర్ చెఫ్ ఇండియా మొదటి సీజన్‌కు అక్షయ్ కుమార్ జడ్జ్‌గా వ్యవహరించారు. దాని తర్వాత సీజన్ కోసం నిర్వాహకులు నన్ను సంప్రదించారు. అక్షయ్ కంటే ఒక్క రూపాయి ఎక్కువ పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేశాను. వాళ్లు అంగీకరించలేదు. ఇది నా గౌరవానికి సంబంధించిన విషయమనిపించింది. వారు నిర్ణయించిన మొత్తానికే నన్ను చేయమన్నారు. దానికి నేను అంగీకరించలేదు. ‘నేను రావడం లేదు, ఈ షో చేయను’ అని వారికి తేల్చి చెప్పాను’’
‘‘ఆ తర్వాత మూడో సీజన్ సమయానికి నిర్వాహకులు మళ్లీ నా దగ్గరకు వచ్చారు. ‘షో సరిగ్గా నడవడం లేదు, మాకు మీ అవసరం ఉంది’ అని చెప్పారు. దాంతో నేను మూడో సీజన్లో భాగమయ్యాను. నా నిబంధన ప్రకారం అక్షయ్ కుమార్ కంటే ఒక్క రూపాయి ఎక్కువ పారితోషికాన్ని చెల్లించారు. ఎందుకంటే ఆ విషయంలో నేను అస్సలు వెనక్కి తగ్గలేదు’’ అని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.