
తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్రప్రభుత్వం అధికారికంగా ప్రక్రియను ప్రారంభించింది.
తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్రప్రభుత్వం అధికారికంగా ప్రక్రియను ప్రారంభించింది. మొత్తం 15,982 ఖాళీలలో 3,100 అంగన్‌వాడీ టీచర్ పోస్టులు మరియు 12,882 సహాయకుల పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఈ నియామకాలు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ ప్రాజెక్టుల ద్వారా జరుగుతాయి.ఇంటర్ మార్కులకు 70శాతం వెయిటేజీఈసారి నియామక విధానంలో ముఖ్యమైన మార్పులు చేశారు. కనీస విద్యార్హతగా ఇంటర్మీడియట్ (10+2) పాస్‌ను తప్పనిసరి చేశారు. ఇంతకుముందు ఉన్న నిబంధనలను సవరించి, ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూను కొత్తగా చేర్చారు. ఇంటర్ మార్కులకు 70శాతం వెయిటేజీ ఇవ్వడంతోపాటు, వితంతువులు, అనాథలు, దివ్యాంగులకు ప్రత్యేక వెయిటేజీలు కల్పించారు. అభ్యర్థులు తప్పనిసరిగా స్థానిక గ్రామం లేదా వార్డుకు చెందినవారై ఉండాలి.టీచర్ పోస్టులకు ఇంటర్వ్యూలుగిరిజన తండాలు, ఎస్టీ ఆవాసాలు, ఎస్సీ వాడల్లోని పోస్టులకు సంబంధిత సామాజిక వర్గాల మహిళలకు మాత్రమే అవకాశం ఉంటుంది. జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ టీచర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించారు. సహాయకుల పోస్టులకు కూడా ఇంటర్ అర్హత మొదటి ప్రాధాన్యత. ఇంటర్ అభ్యర్థులు లభ్యం కాని సందర్భంలో మాత్రమే 10వ తరగతి పాసైన వారిని పరిగణనలోకి తీసుకుంటారు.పెద్దపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఇప్పటికే నోటిఫికేషన్లుమల్టీజోన్-1లో 20,584 అంగన్‌వాడీ కేంద్రాల్లో 9,590ఖాళీలు (1,853 టీచర్లు + 7,737 సహాయకులు). మల్టీజోన్-2లో 15,197కేంద్రాల్లో 6,392ఖాళీలు (1,247 టీచర్లు + 5,145 సహాయకులు) ఉన్నాయి. పెద్దపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఇప్పటికే నోటిఫికేషన్లు వెలువడ్డాయి. మిగిలిన జిల్లాల్లో కూడా త్వరలో నోటిఫికేషన్లు జారీ అవుతాయి. ప్రభుత్వం ఏడాదిన్నర క్రితమే ఈ భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని భావించినా, పారదర్శకత కోసం ఇతర రాష్ట్రాల అనుభవాలను అధ్యయనం చేసి కొత్త మార్గదర్శకాలను రూపొందించింది.విద్యా విప్లవం.. రూ. 600 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మక తెలంగాణా ఎడ్యుకేషన్‌ హబ్‌!అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా దరఖాస్తులుజీవో నం.4 మరియు జీవో నం.6 ద్వారా ఇంటర్వ్యూ మరియు వెయిటేజీ విధానాలను స్పష్టం చేసింది. ఈ నియామకాలు అంగన్‌వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని అంచనా. నిరుద్యోగ మహిళలు తమ స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం లేదా అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా నోటిఫికేషన్లు చూసి దరఖాస్తు చేసుకోవాలి. ఈ అవకాశం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మరియు బాల్య పోషణకు ఉపయోగపడుతుంది.