
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
TCL 55 inch Mini LED TV Flipkart Offers: ప్రస్తుతం భారత మార్కెట్లో కూడా TCL హవా కొనసాగుతూ వస్తుంది. అత్యంత తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లతో కూడిన స్మార్ట్‌టీవీలను విక్రయించడంలో ఈ కంపెనీ ముందుంది. అలాగే ఈ స్మార్ట్‌టీవీలు చాలా తక్కువ ధరతో రావడంతో మిడిల్ క్లాస్ వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు TCL కంపెనీ కొత్త కొత్త ఫీచర్లతో మంచి మంచి టీవీలను విడుదల చేస్తూ వస్తోంది. అయితే మీరు కూడా ఎప్పటినుంచో ఇదే బ్రాండ్‌కు సంబంధించిన టీవీ ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా?
55 అంగుళాలు కలిగిన TCL స్మార్ట్‌టీవీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఆఫర్స్‌తో లభిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడే దీనిని కొనుగోలు చేయాలనుకునే వారికి ఎన్నో రకాల స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ లభిస్తున్నాయి. అయితే ఇది మార్కెట్లో ఇప్పుడు 55Q6CS మోడల్ నెంబర్‌తో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకుందాం..
TCL 55Q6CS (55 ఇంచుల) Ultra HD (4K) Mini LED Smart గూగుల్ స్మార్ట్‌టీవీ ఫీచర్స్ కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..55 ఇంచులు (139 సెం.మీ) 4K Ultra HD (3840 x 2160 పిక్సెల్స్) డిస్ప్లేన్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది సాధారణ LED ల కంటే మెరుగైన బ్రైట్నెస్ తో కూడిన QD-Mini LED సపోర్టుతో అందుబాటులోకి వచ్చింది.
అంతేకాకుండా ఇందులో 312+ లోకల్ డిమ్మింగ్ జోన్లు ఉండటం వల్ల స్క్రీన్‌పై లైటింగ్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అలాగే కంపెనీ ఎంతో ప్రత్యేకమైన AiPQ Processor ను అందిస్తూ వస్తోంది. దీంతోపాటు Dolby Vision, HDR10+, HLG తో పాటు IMAX Enhanced సర్టిఫికేషన్ కలిగి ఉంది. దీనివల్ల థియేటర్ లాంటి అనుభూతి లభిస్తుంది. అదేవిధంగా 40 Watts పవర్ఫుల్ ఆడియో సపోర్టు కూడా అందుబాటులో ఉంది. ఇందులో కంపెనీ సౌండ్ కోసం బిల్ట్-ఇన్ సబ్‌వూఫర్ అందించడమే కాకుండా ONKYO 2.1 Hi-Fi స్పీకర్స్ సిస్టంను అందిస్తోంది. అలాగే చాలా ప్రత్యేకమైన Dolby Atmos, DTS ప్రీమియం సౌండ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది Google TV ఆపరేటింగ్ సిస్టంతో అందుబాటులోకి వచ్చింది. దీని ఇంటర్ఫేస్ ఎంతో అద్భుతంగా ఉంటుంది.
దీంట్లో కంపెనీ వాయిస్ కంట్రోల్ ఆప్షన్ కూడా అందిస్తోంది..హాండ్స్-ఫ్రీ వాయిస్ కంట్రోల్ (Google Assistant), బిల్ట్-ఇన్ క్రోమ్‌కాస్ట్, ఎయిర్‌ప్లే సపోర్ట్ కూడా అందుబాటులో ఉండడం విశే. అలాగే గేమింగ్ చేసే వాళ్ళకి కంపెనీ గేమింగ్ మాస్టర్ మోడ్ ను కూడా అందుబాటులో ఉంచింది.. ఇవే కాకుండా ఇందులో కంపెనీ ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లను అందిస్తూ వస్తుంది.. ఇక ఈ టీవీకి సంబంధించిన ధర, ఇతర వివరాల్లోకి వెళ్తే.. కంపెనీ మార్కెట్లో దీనిని MRP ధర రూ.98,9990 లకు విక్రయిస్తోంది. అయితే ఇప్పుడే దీనిని ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసే వారికి ఏకంగా 54 శాతం వరకు స్పెషల్ తగ్గింపు లభిస్తుంది. దీంతో ఇది కేవలం రూ.45,990 లకే పొందవచ్చు. ఇవే కాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.
ఈ టీవీ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళ్తే.. దీనిని ఇప్పుడే ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లిప్కార్ట్అనుసంధాన యాక్సిస్ బ్యాంకుతో పాటు ఎస్బిఐ బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే రూ.4,990 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేస్తే రూ.3,500 వరకు తగ్గింపు పొందవచ్చు. అదేవిధంగా ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించే వారికి రూ.3 వేల బోనస్ లభిస్తుంది. దీంతో ఇది కేవలం రూ.39 వేల లోపే పొందవచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.