
ఇంటర్నెట్ డెస్క్: కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో విజయ్- త్రిష పేర్లు వైరలైన విషయం తెలిసిందే. వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారని వార్తలు వచ్చాయి. తాజాగా వీరిద్దరూ విడిపోయారని ప్రచారం జరుగుతోంది.
జూన్ 22న విజయ్ పుట్టినరోజు కావడంతో సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ సీఎం అయ్యాక తొలి పుట్టినరోజు కావడంతో త్రిష (Trisha) విషెస్ కోసం అందరూ ఎదురుచూశారు. ప్రతి సంవత్సరం ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపే త్రిష మాత్రం ఈసారి ఎలాంటి పోస్ట్ పెట్టకపోవడంతో నెట్టింట కొత్త చర్చ ప్రారంభమైంది.
కొన్నేళ్లుగా విజయ్ (Vijay) పుట్టినరోజున ఆయనతో కలిసి దిగిన అరుదైన ఫొటోలను త్రిష పంచుకునే వారు. కానీ, ఈసారి ఆమె మౌనంగా ఉండడంతో పాటు.. ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ను అన్‌ఫాలో చేశారు. దీంతో ఈ అంశంపై నెట్టింట చర్చ జరుగుతోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.