
ఇంటర్నెట్డెస్క్: స్పేస్ఎక్స్ (SpaceX) ఐపీవో ఆనందం నెమ్మదిగా ఇన్వెస్టర్లలో ఆవిరి అవుతోంది. ఆ సంస్థ షేర్లు గత మూడ్రోజులుగా వరుసగా భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి.
దీంతో దాని మార్కెట్ విలువ ఏకంగా 600 బిలియన్ డాలర్లకుపైగా పడిపోయింది. భారీగా రుణ సమీకరణకు ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ బాండ్లను విక్రయిస్తామని స్పేస్ఎక్స్ ప్రకటించిన తర్వాత నుంచి .. మదుపర్లు అప్రమత్తమై భారీగా షేర్ల విక్రయాలు మొదలుపెట్టారు. సోమవారం ఒక్కరోజే కంపెనీ వాటాల విలువ 16 శాతం పడిపోయింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ 2 ట్రిలియన్ డాలర్లకు పైగా ఉంది. ‘‘ఈ షేర్లను దక్కించుకోవాలని అనుకున్నవాళ్లు కొనుగోలు చేశారు.. ఇప్పుడు తిరిగి సెల్లర్ల కంట్రోల్లో ఉంది’’ అని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
75 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయి ఐపీవో లిస్టింగ్ తర్వాత ఈ కంపెనీ షేర్లు భారీగా ర్యాలీ చేశాయి. పబ్లిక్ ఇష్యూలో షేరు ధర 135 డాలర్లు కాగా కొన్ని రోజుల్లోనే వీటి విలువ 60% పెరిగింది. ఆ తర్వాత కంపెనీ 20 బిలియన్ డాలర్ల బాండ్లు ఆఫర్ చేయనున్నట్లు కథనాలు వెలువడటంతో ఇన్వెస్టర్లు విక్రయాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం మార్కెట్ విలువలో స్పేస్ఎక్స్ ఆరో అతిపెద్ద కంపెనీగా నిలిచింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.