
ఆఫీసుకు వేసుకెళ్లే దుస్తులు, చీరల్ని ధరించిన ప్రతిసారీ ఉతకరు కొంతమంది. రెండుమూడుసార్లు మార్చి వేసుకున్నాకే శుభ్రం చేస్తుంటారు. బ్రా వంటి లోదుస్తుల విషయంలోనూ కొందరు ఇలాగే చేస్తుంటారు.
ఎక్కువ చెమట పట్టలేదని, రోజూ ఉతికితే అవి త్వరగా పాడవుతాయని.. ఇలా బ్రాలను ఉతికే విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో ఆలోచన!
ఆఫీసుకు వేసుకెళ్లే దుస్తులు, చీరల్ని ధరించిన ప్రతిసారీ ఉతకరు కొంతమంది. రెండుమూడుసార్లు మార్చి వేసుకున్నాకే శుభ్రం చేస్తుంటారు. బ్రా వంటి లోదుస్తుల విషయంలోనూ కొందరు ఇలాగే చేస్తుంటారు. ఎక్కువ చెమట పట్టలేదని, రోజూ ఉతికితే అవి త్వరగా పాడవుతాయని.. ఇలా బ్రాలను ఉతికే విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో ఆలోచన! మరి, ఇలా బ్రాను ఉతక్కుండా ఒకటి కంటే ఎక్కువసార్లు ధరించడం మంచిదేనా.. అంటే? అది బ్రా రకం, చర్మతత్వంపై ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. ఇంతకీ, వీటిని ఎన్ని రోజులకోసారి శుభ్రం చేయాలి? ఈ క్రమంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలేంటి? తెలుసుకుందాం రండి..
బ్రా రకం, వాతావరణం, చర్మతత్వాన్ని బట్టి వాటిని రోజూ ఉతకాలా? లేదంటే రెండుమూడు సార్లు వాడాక ఉతకొచ్చా అనే విషయం ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు.
⚛ సాధారణంగా రెగ్యులర్గా వాడే బ్రాలను రెండు లేదా మూడుసార్లు ధరించాకనైనా శుభ్రపరచచ్చని చెబుతున్నారు. అది కూడా వాతావరణం చల్లగా ఉన్న పరిస్థితుల్లో ఇలా చేయచ్చంటున్నారు.
⚛ ఇక కొంతమందిలో కాలంతో సంబంధం లేకుండా చెమట పడుతుంటుంది. ఇలాంటి వారు రోజూ బ్రాను ఉతకడం మంచిదంటున్నారు. అలాగే హ్యూమిడిటీ, వేడి వాతావరణం ఉన్నప్పుడు కూడా వీటిని రెగ్యులర్గా శుభ్రం చేయాల్సి ఉంటుంది.
⚛ వ్యాయామం చేసే వారు స్పోర్ట్స్ బ్రాను ఎంచుకుంటారు. అయితే ఈ క్రమంలో చెమట ఎక్కువగా పడుతుంది. కాబట్టి ధరించిన ప్రతిసారీ దాన్ని శుభ్రం చేయడం తప్పనిసరి.
కాబట్టి బ్రాను శుభ్రం చేసే విషయంలో ఇవన్నీ దృష్టిలో ఉంచుకోవాలి. లేదంటే చర్మంపై మొటిమలు, ర్యాషెస్, దురద.. వంటి సమస్యలొస్తాయి. పదే పదే అదే బ్రాను ధరించడం వల్ల చర్మంపై ఉండే చెమట, మురికి, బ్యాక్టీరియా, మృతకణాలు.. వాటిపై చేరి చర్మానికి హాని చేస్తాయి అంటున్నారు నిపుణులు.
బ్రా ఉతికేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా దాని మన్నికను పెంచచ్చంటున్నారు నిపుణులు.
⚛ వీటిని సాధ్యమైనంత వరకు చేత్తోనే ఉతకాలి. అది కూడా చల్లటి నీళ్లు, గాఢత తక్కువగా ఉండే సబ్బు/డిజర్జెంట్ లిక్విడ్.. వంటివి ఉపయోగించాలి.
⚛ ఒకవేళ మెషీన్లో వేయాలనుకుంటే.. ముందు దాన్ని వాష్ బ్యాగ్లో ఉంచి.. జెంటిల్ సైకిల్ ఆప్షన్ ఎంచుకోవాలి. అయితే డ్రై అవ్వకముందే తీసి ఆరుబయట ఆరేయాలి.
⚛ ఉతికిన దుస్తుల్లో నీళ్లు తీసేయడానికి వాటిని మెలిపెట్టి పిండుతుంటాం. బ్రాలను అలా చేయకూడదు. దానివల్ల వాటి ఆకృతి దెబ్బతినే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అలాగే అవి సాగే గుణాన్ని కూడా కోల్పోతాయంటున్నారు. అంతేకాదు.. ప్యాడెడ్ బ్రాలైతే అవి వంగిపోయే అవకాశమూ ఉంటుందట!
⚛ బ్రాలను జీన్స్, ఇతర మందపాటి దుస్తులతో కలిపి ఉతక్కూడదట! అలాగే ఉతికిన బ్రాలను నీడలోనే ఆరేయాలి.
⚛ అలాగే వీటిని సాధారణ దుస్తుల్లా ఎలా పడితే అలా మడతపెట్టకూడదట! ముందు హుక్స్ పెట్టి ఇరువైపులా స్ట్రిప్స్ని లోపలికి మడుస్తూ.. కప్స్ పైకి వచ్చేలా ఫోల్డ్ చేయాలి. అప్పుడే వాటి ఆకృతి, సాగే గుణం దెబ్బతినకుండా ఉంటుందంటున్నారు నిపుణులు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.