
తెలంగాణ టీ20 లీగ్‌లో తొలి సెంచరీ నమోదైంది. ఈ టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్ కెప్టెన్ అమన్‌రావు పేరాల విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.
Jun 22 2026 8:07 PM | Updated on Jun 22 2026 8:19 PM
తెలంగాణ టీ20 లీగ్‌లో తొలి సెంచరీ నమోదైంది. ఈ టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్ కెప్టెన్ అమన్‌రావు పేరాల విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ధి బౌలర్లను అమన్ ఉతికారేశాడు.
మెదక్ కెప్టెన్ తిలక్ వర్మను కూడా అతడు విడిచిపెట్టలేదు. 7 ఓవర్ వేసిన తిలక్ బౌలింగ్‌లో అతడు 15 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో అమన్ రావు కేవలం 32 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 7 ఫోర్లు, 10 సిక్స్‌లు ఉన్నాయి.
కాగా అమన్‌రావ్ ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ క్యాంప్‌లో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. అమన్ రాజస్తాన్ తరపున అరంగేట్రం చేయనప్పటికి జోఫ్రా ఆర్చర్ వంటి వరల్డ్‌క్లాస్ బౌలర్‌ను నెట్స్‌లో ఎదుర్కొన్న అనుభవం అతడికి బాగా కలిసొచ్చింది. వైభవ్ సూర్యవంశీ వంటి యువ సంచలనంతో కూడా డ్రెస్సింగ్ రూమ్‌ను అమన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు వైభవ్ తరహాలోనే టీజీ 20 లీగ్‌లో అమన్ దుమ్ములేపుతున్నాడు.
అనసూయ బీచ్ వెకేషన్.. ఎంజాయ్ చేస్తూ (ఫొటోలు)
మా ఇంటి బంగారంలా మెరిసిపోతున్న యాంకర్ శ్రీముఖి.. ఫోటోలు
చీరకట్టులో సరికొత్తగా గ్లామర్ చూపిస్తూ.. (ఫొటోలు)
సిల్వర్ శారీలో ధగ ధగ మెరిసిపోతున్న భూమి పెడ్నేకర్
‘హను మాన్ 3డీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
దారుణం.. మంచినీళ్లు ఇవ్వలేదని తల్లిపై కొడుకు దాడి
చిన్నారి డ్రీమ్ ను నిజం చేసిన బన్నీ.. స్వయంగా వీడియో కాల్ చేసి..!
మెట్రో రైల్ ఎక్కిన కోతి.. చుట్టాలింటికి పోతున్నదేమో
ఎంపీకి, CI నాగరాజు మధ్య భారీ డీల్? బయటకి వస్తున్న సంచలన నిజాలు