
ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన 'స్వర్ణాంధ్ర 2047 విజన్' అమలులో ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.
ఇందులో భాగంగా నిర్దేశించిన పది సూత్రాలను సమర్థంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రణాళికా విభాగం, కేఆర్ఈఏ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్ (ఐఎఫ్ఎంఆర్) మధ్య సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) జరిగింది. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రణాళికా విభాగం ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఐఎఫ్ఎంఆర్ ప్రతినిధి కపిల్ విశ్వనాధన్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో 15 శాతం వృద్ధిరేటును సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. 2014-19 మధ్య కాలంలో 13.5 శాతం సగటు వార్షిక వృద్ధి రేటును (సీఏజీఆర్) సాధించామని, అయితే గత ఐదేళ్లలో వివిధ కారణాల వల్ల అది 11 శాతానికి పరిమితమైందని విశ్లేషించారు. ఇప్పుడు నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేందుకు ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ), వృద్ధిరేటు సాధనలో పది సూత్రాల మిషన్ సెల్స్‌ను ఏర్పాటు చేసి, వాటి పర్యవేక్షణ బాధ్యతలను ఐఎఫ్ఎంఆర్ చూస్తుంది.తొలిదశలో జీరో పావర్టీ (పేదరిక నిర్మూలన), వాటర్ సెక్యూరిటీ (జల భద్రత), డీప్ టెక్నాలజీ మిషన్లపై ఐఎఫ్ఎంఆర్ ప్రభుత్వంతో కలిసి పనిచేయనుంది. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, విధానపరమైన సూచనలు అందించడంతో పాటు, వినూత్న పద్ధతులను సిఫారసు చేస్తుంది. ఈ పది సూత్రాల అమలును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం రాష్ట్రస్థాయి కమిటీతో పాటు, మిషన్ వర్కింగ్