
నీట్-యూజీ రీటెస్ట్ సందర్భంగా బెంగళూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీ ప్రభావంతో నగరంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
దీనివల్ల పలువురు విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోలేకపోయారు. నిబంధనల ప్రకారం అధికారులు వారిని లోపలికి అనుమతించకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ పరిణామం ప్రస్తుతం రాజకీయ దుమారానికి దారితీసింది.దేశవ్యాప్తంగా ఆదివారం నీట్ రీటెస్ట్ నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిబంధనల ప్రకారం గంటన్నర ముందుగానే, అంటే 1:30 గంటలకు గేట్లు మూసివేయాల్సి ఉంది. అయితే, అదే సమయంలో బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో బీకే హరిప్రసాద్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే కార్యక్రమం జరగడంతో నగరంలోని పలు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఫలితంగా ప్రభుత్వ ఆర్సీ కళాశాల సహా పలు కేంద్రాలకు వెళ్లాల్సిన విద్యార్థులు ఆలస్యంగా చేరుకున్నారు. గేట్లు మూసివేసిన సిబ్బంది వారిని లోపలికి అనుమతించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. కొంతమంది విద్యార్థులు ప్రహరీ గోడలు దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. సాధారణంగా 20 నిమిషాల్లో చేరుకోవాల్సిన 7 కిలోమీటర్ల దూరానికి ట్రాఫిక్ వల్ల 35 నిమిషాలకు పైగా సమయం పట్టిందని ఒక విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. విద్యార్థుల భవిష్యత్తు కంటే కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య విమర్శించారు. పరీక్ష తేదీ ముందే ఖరారైనప్పటికీ, అదే రోజున