
ఉదయం ఉద్యోగం.. సాయంత్రం మరో పని.. రాత్రి ఇంకో ఆదాయ మార్గం. ఈ రోజుల్లో చాలా మంది అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తున్నారు. కొందరు తమ అభిరుచులనే ఆదాయ వనరులుగా మార్చుకుని విజయవంతమవుతున్నారు.
అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ఓ మహిళ అలాంటి వారిలో ఒకరు. పూర్తి స్థాయి ఉద్యోగం చేస్తూనే నెలకు దాదాపు రూ.లక్ష అదనపు ఆదాయం సంపాదిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.జీతం సరిపోవడం లేదున్యూయార్క్లోని ఓ కృత్రిమ మేధ (ఏఐ) స్టార్టప్‌లో 35 ఏళ్ల జెన్నిఫర్ మార్టినెజ్ ప్రొడక్ట్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తోంది. అయినప్పటికీ పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా జీతం సరిపోవడం లేదని భావించింది. ఇల్లు కొనాలి, ఎక్కువగా ప్రయాణాలు చేయాలి అనే లక్ష్యాలు ఉన్నప్పటికీ అవి జీతంతోనే సాధ్యం కావడం లేదని గుర్తించింది. దీంతో అదనపు ఆదాయం కోసం కొత్త మార్గాలను వెతకడం ప్రారంభించింది. రెండేళ్ల క్రితం ఓ చిన్న ఆలోచనతో మొదలైన ప్రయాణం ఇప్పుడు ఆమెకు నెలకు గణనీయమైన ఆదాయం తెచ్చిపెడుతోంది.కుక్కలే ఆదాయ మార్గంజెన్నిఫర్ మొదట పెంపుడు కుక్కలను చూసుకునే సేవను ప్రారంభించింది. యజమానులు బయటకు వెళ్లిన సమయంలో కుక్కలను తన ఇంట్లో ఉంచుకుని సంరక్షించడం ఆమె పని. మొదట్లో కుక్కలు ఇబ్బంది పెడతాయేమోనని భయపడినా తర్వాత అది తనకు ఇష్టమైన పనిగా మారిందని చెబుతోంది. ప్రస్తుతం నెలలో 20 నుంచి 25 రోజులు కుక్కలను చూసుకుంటోంది. ఒక్క రాత్రికి 65 డాలర్లు వసూలు చేస్తోంది. దీంతో కేవలం ఈ పని ద్వారానే నెలకు వెయ్యి డాలర్లకు పైగా అంటే భారత