
రష్యా రాజధాని మాస్కోను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ మరోసారి డ్రోన్లతో దాడులు చేసింది. ఉక్రెయిన్‌కు చెందిన డ్రోన్లు మాస్కో వైపు దూసుకొస్తుండగా, రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి.
రష్యా రాజధాని మాస్కోను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ మరోసారి డ్రోన్లతో దాడులు చేసింది. ఉక్రెయిన్‌కు చెందిన డ్రోన్లు మాస్కో వైపు దూసుకొస్తుండగా, రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. దాదాపు 60 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. ఈ పరిణామంతో మాస్కోలోని నాలుగు ప్రధాన విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు (Moscow drone attack).
మాస్కోను లక్ష్యంగా చేసుకుని వచ్చిన డ్రోన్లను నగర పరిసర ప్రాంతాల్లోనే అడ్డుకుని ధ్వంసం చేసినట్టు ఆ ప్రాంత మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు. డ్రోన్ల శకలాలు పడిన ప్రాంతాలకు అత్యవసర సిబ్బందిని పంపినట్లు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రాణనష్టం లేదా భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు నివేదికలు లేవని అన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా షెరెమెత్యేవో, డొమోడెడోవో, వ్నుకోవో, జుకోవ్స్కీ విమానాశ్రయాల్లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత విమాన సర్వీసులను పునరుద్ధరించారు (Moscow airports closed).
అలాగే, ముందు జాగ్రత్త చర్యగా క్రిమియాలో సోమవారం జరగాల్సిన అన్ని బహిరంగ కార్యక్రమాలను అధికారులు రద్దు చేశారు (Russia Ukraine war). సాధ్యమైనంత వరకు విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రజలకు సూచించారు. గత కొద్ది రోజులుగా రష్యాలోని చమురు శుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో చమురు కొరత ఏర్పడింది.
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
క్యాబ్ డ్రైవర్‌కు జాక్‌పాట్.. రూ.500తో టికెట్ కొంటే రూ.3 కోట్లు..