
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గతేడాది టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌గా భారత జట్టుకు అద్భుత విజయాలు అందించిన అతడు..
ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్‌లో ఆడి అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేస్తాడనే అంచనాలున్నాయి. అయితే, ఇప్పటికీ ఫిట్‌గా.. ఫామ్‌లో ఉన్న కోహ్లీ టెస్టుల్లో పునరాగమనం చేయాలని కోరుకొనేవారు లేకపోలేదు. తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న విరాట్ కోహ్లీకి ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. దీనికి అతడు చాలా లౌక్యంగా సమాధానం ఇవ్వడం గమనార్హం.
స్పోర్ట్స్ బ్రాండ్ వన్8 లాంచ్ ఈవెంట్‌కు విరాట్ కోహ్లీ హాజరయ్యాడు. ఈ బ్రాండ్‌లోని ఓ షూ ధర రూ. 9,230గా ఉంది. టెస్టుల్లో విరాట్ సాధించిన పరుగుల సంఖ్య కూడా అంతే. దానికి కోట్ చేస్తూ.. కార్యక్రమానికి హోస్ట్‌గా ఉన్న కమెడియన్ డానిష్ సైత్ ఓ ప్రశ్న సంధించాడు. ‘‘మీరు ఇంకొన్ని పరుగులు చేసి.. ఆ వస్తువు లాభాలను పెంచొచ్చు కదా?’’ అని విరాట్‌ను అడిగాడు. దీనికి కోహ్లీ బదులిస్తూ.. ‘‘నేను తక్కువ ధరకే అమ్మేయడానికి ఇష్టపడతాను. ఇక మీరు అడుగుతున్న దానితో (టెస్టు క్రికెట్) నా పని అయిపోయింది. ధన్యవాదాలు’’ అని చెప్పాడు. దీంతో విరాట్ మళ్లీ టెస్టుల్లోకి పునరాగమనం చేసే అవకాశాలు లేవని స్పష్టమైందని క్రికెట్ వర్గాలు తెలిపాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.