
పర్యావరణ పరిరక్షణలో ప్రపంచవ్యాప్తంగా సరికొత్త చర్చకు దారితీసే ఓ చారిత్రాత్మక నిర్ణయం వెలువడింది. కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్‌లో ఉన్న టెరాస్-వౌడ్రూయిల్ అనే చిన్న పట్టణం, చెట్లను ప్రాణం ఉన్న...
పర్యావరణ పరిరక్షణలో ప్రపంచవ్యాప్తంగా సరికొత్త చర్చకు దారితీసే ఓ చారిత్రాత్మక నిర్ణయం వెలువడింది. కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్‌లో ఉన్న టెరాస్-వౌడ్రూయిల్ అనే చిన్న పట్టణం, చెట్లను ప్రాణం ఉన్న జీవులుగా అధికారికంగా గుర్తించింది. వాటికి కూడా హక్కులు ఉంటాయని స్పష్టం చేస్తూ జూన్ 9న పట్టణ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఈ నిర్ణయంతో చెట్లకు హక్కులు కల్పించిన కెనడాలోని తొలి మున్సిపాలిటీగా ఈ పట్టణం నిలిచింది.మాంట్రియల్ ద్వీపానికి పశ్చిమాన ఉన్న టెరాస్-వౌడ్రూయిల్ జనాభా కేవలం 2,000 మాత్రమే. ఈ పట్టణ కౌన్సిల్ "యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది ట్రీ" అనే అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమానికి మద్దతుగా ఈ తీర్మానం చేసింది. ఈ తీర్మానంలో మూడు కీలక అంశాలను పొందుపరిచారు. మొదటిది - చెట్లు ప్రాణం ఉన్న జీవులు, మానవాళికి ఉమ్మడి సంపద. రెండవది - భూమిపై జీవం వాటి ఉనికిపైనే ఆధారపడి ఉంది. మూడవది - మానవులు వాటితో సోదరభావంతో, సంఘీభావంతో వ్యవహరించాలి.ఈ వినూత్న నిర్ణయం వెనుక క్యూబెక్ ఫిల్మ్ మేకర్ ఆండ్రీ డెస్రోచర్స్ తీసిన "డెస్ ఆర్బ్స్ ఎట్ డెస్ ఆర్ట్స్" (Des arbes et des arts) అనే సినిమా స్ఫూర్తిగా నిలిచిందని మేయర్ మిచెల్ బోర్డో తెలిపారు. ఈ సినిమా ప్రదర్శన అనంతరం చెట్లను వస్తువులుగా కాకుండా ప్రాణులుగా గుర్తించడంపై పట్టణంలో విస్తృతమైన ప్రజా చర్చ జరిగింది. ఈ చర్చల ఫలితంగా టెరాస్-వౌడ్రూయిల్ పర్యావరణ కమిటీ ద్వారా మున్సిపల్ కౌన్సిల్‌కు ఒక అధికారిక విజ్ఞప్తి అందింది. దీని